Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను చనిపోయాననే పుకార్లు పుట్టించారు.. దాని ముందు ఇదెంతా?: రవీంద్ర జడేజా

Ravindra Jadejas hilarious take on rumours regarding him, says Once Read, I Had Died...

దుబాయ్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన గురించి ప్రచారం అవుతున్న పుకార్లపై స్పందించాడు. ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జడేజా సూపర్ బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక హాంకాంగ్‌తో మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తన పట్ల వచ్చిన పుకార్లపై తనదైన శైలిలో స్పందించాడు.

చనిపోయినట్లే రాసారు..

చనిపోయినట్లే రాసారు..

ఐపీఎల్ 2022 సీజన్‌లో గాయపడ్డ తాను తాను టీ20 వరల్డ్ కప్‌కు దూరం అవుతానని ప్రచారం చేశారని, తాను వరల్డ్ కప్ జట్టులో భాగం కాననేది చిన్న రూమర్ మాత్రమేనన్న జడేజా.. ఓసారి తాను చనిపోయాననే వార్త కూడా వైరల్ అయ్యిందన్నాడు. అలాంటి రూమర్లతో పోలిస్తే ఇదెంత.. అన్నట్టుగా వ్యాఖ్యానించాడు. 'రూమర్ల గురించి నేను ఏ మాత్రం ఆలోచించను.

మైదానంలో బాగా ఆడటంపైనే నా ఫోకస్ ఉంటుంది. మరింత మెరుగవ్వడంపైనే దృష్టిసారిస్తా. మైదానంలోకి వెళ్లి ఆడటమే నా పని. పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో.. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో మెరుగ్గా రాణించడంపై నెట్స్‌లో వర్క్ చేయడమే నా పని. అంతేగానీ బయటి విషయాలు గురించి ఆలోచించే టైమ్ నాకు ఉండదు'అని తెలిపాడు.

ఐపీఎల్‌లో విఫలం..

ఐపీఎల్‌లో విఫలం..

ఐపీఎల్ 2022లో జడేజా తీవ్రంగా నిరాశపర్చిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన జడ్డూ కెప్టెన్సీ భారాన్నిమోయాలేకపోయాడు. 19.33 యావరేజ్‌తో జడ్డూ 116 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. గాయం కారణంగా టోర్నీ చివరి మ్యాచ్‌లకు జడేజా దూరమయ్యాడు. అయితే మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పించడంతోనే జడేజా జట్టుకు దూరమయ్యాడని అప్పట్లో ప్రచారం జరిగింది. గాయం నుంచి వేగంగా కోలుకున్న జడ్డూ.. ఇంగ్లండ్‌‌‌తో టూర్‌కు వెళ్లాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో సెంచరీ బాదాడు.

సూపర్ బ్యాటింగ్..

సూపర్ బ్యాటింగ్..

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన జడేజా.. హార్దిక్ పాండ్యతో కలిసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆఖరి ఓవర్లో జడ్డూ ఔటయినప్పటికీ.. అప్పటికే మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. హార్దిక్ పాండ్య సిక్స్ బాది జట్టును గెలిపించాడు. బుధవారం దుబాయ్ వేదికగా హాంగ్ కాంగ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌ టీమిండియాకు నెట్ ప్రాక్టీస్‌లా ఉపయోగపడనుంది.

Story first published: Wednesday, August 31, 2022, 17:05 [IST]
Other articles published on Aug 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+