సంజయ్ మంజ్రేకర్ ఛాట్ లీక్.. మరోసారి రవీంద్ర జడేజాపై సంచలన వ్యాఖ్యలు! ఈసారి ఏమన్నాడంటే?

ముంబై: భారత మాజీ క్రికెటర్, వివాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ అందరి ఆగ్రహానికి గురవవుతుంటాడు. 2019 ప్రపంచకప్ సమయంలో సహచర కామెంటేటర్ హర్ష భోగ్లే, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. వ్యాఖ్యానంకు దూరమయ్యాడు.
అయినా తన పంతా మార్చుకోవడంలేదు. తాజాగా ఇండియన్ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను టార్గెట్ చేశాడు. అశ్విన్ మంచి స్పిన్నరే కావచ్చు కానీ.. ఆల్‌టైమ్ గ్రేట్‌లో ఒకడు మాత్రం కాదని మంజ్రేకర్ అభిప్రాయపపడ్డాడు. ఈ విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. మాజీలు అందరూ మంజ్రేకర్‌పై మండిపడుతున్నారు.
వైరల్ స్క్రీన్‌షాట్స్
రవిచంద్రన్ అశ్విన్‌పై సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై సూర్య నారాయణ్ అనే ట్విటర్ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ట్వీట్లు, అభిప్రాయాలతో మంజ్రేకర్ పాపులర్ అవుదాం అనుకుంటున్నాడని.. అశ్విన్‌కు 10 శాతం కూడా సరితూగడని పేర్కొన్నాడు. దీనిపై మంజ్రేకర్ స్పందించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. వారి సంభాషణలో 2019 ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాను 'బిట్స్ అండ్ పీసెస్' అన్న విషయం కూడా వచ్చింది. వాటికి సంబంధించి ఆ అభిమాని బయటపెట్టిన ట్విటర్ స్క్రీన్‌షాట్స్ ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.

జడేజాకు ఇంగ్లిష్ రాదు
'నువ్వు చాలా దారుణంగా ఉన్నావు. మీలాగా ప్లేయర్స్‌ను నేను కూడా పొగడాలంటే ఎలా?. నేను అభిమానిని కాను. ఓ విశ్లేషకుడిని. బిట్స్ అండ్ పీసెస్ అసలు అర్థం ఏంటోరవీంద్ర జడేజాకు తెలియదు. ఎందుకంటే అతనికి ఇంగ్లిష్ రాదు' అని సదరు అభిమానితో సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. 'ఈ వ్యక్తిగత చాట్‌ను బహిరంగం చేయాలనుకోలేదు. కానీ మంజ్రేకర్ అసలు స్వరూపం మీకు తెలియాలి. జడేజాను కించపరచడానికి ట్వీట్లు చేశాడు. బీసీసీఐ.. ఇలాంటి కెమెంటేటర్ అవసరమా?' అని సూర్య నారాయణ్ పేర్కొన్నాడు. తన చాట్‌కు సంబందించిన కొన్ని స్క్రీన్‌షాట్స్ కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Racist tweets: భారతీయులపై ఎగతాళి ట్వీట్లు..చిక్కుల్లో మరో ఇద్దరు ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్స్!!

జడేజా ఘాటు రిప్లై
రవీంద్ర జడేజా ఓ బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అని 2019 ప్రపంచకప్ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్ విమర్శించాడు. 'నేను అరకొర ఆటగాళ్లని పెద్దగా అభిమానించను. వన్డేల్లో రవీంద్ర జడేజా ఇప్పుడు ఆ కోవకి చెందిన ప్లేయర్. టెస్టుల్లో జడేజా మంచి బౌలర్. కానీ వన్డేల్లో అతను బ్యాట్స్‌మెన్ కాదు. అలా అని బౌలర్ కూడా కాదు' అని జడేజాను తేలిక చేసి మాట్లాడాడు. ఇందుకు జడేజా కూడా ఘాటుగా స్పందించాడు. 'మంజ్రేకర్ నీ కెరీర్‌లో నువ్వు ఆడిన మ్యాచ్‌ల కంటే రెట్టింపు మ్యాచ్‌లను నేను ఆడాను. ఇప్పటికీ ఆడుతున్నాను. ఏదైనా సాధించిన వారిని గౌరవించడం నేర్చుకో. ఇకనైనా నీ నోటి విరోచనాలు ఆపు' అని జడేజా ఫైర్ అయ్యాడు. అప్పుడు ముగిసిన ఆ వివాదం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.

అశ్విన్ కౌంటర్
తనను తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేసిన సంజయ్ మంజ్రేకర్‌పై సోషల్ మీడియా వేదికగా రవిచంద్రన్ అశ్విన్ కూడా కౌంటర్ ఇచ్చాడు. మంజ్రేకర్ ట్వీట్‌కు అశ్విన్ రిప్లై ఇస్తూ.. తమిళ మూవీ అన్నియన్ (అపరిచితుడు)లోని ఓ డైలాగ్ మీమ్‌ను పోస్ట్ చేశాడు. అప్డి సొల్లాదా చారీ, మనసెల్లమ్ వలికిర్దు (అలా అనకు చారీ.. నా మనసు బాధపడుతుంది) అనే తమిళ డైలాగుతో ఉన్న ఫొటోను అశ్విన్ వ్యంగ్యంగా పోస్ట్ చేశాడు. మంజ్రేకర్ భారత్ తరఫున 37 టెస్టులు, 74 వన్డేలు ఆడాడు. మొత్తంగా 5 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు బాదాడు. రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications