ఈ అవార్డ్ గుజరాత్ విద్యాశాఖ మంత్రికి అంకితం: రవీంద్ర జడేజా
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనను తన సతీమణి, గుజరాత్ విద్యాశాఖ మంత్రి రివాబా జడేజాకు అంకితమిస్తున్నట్లు రవీంద్ర జడేజా తెలిపాడు. ఈ రోజు తాను మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేస్తానని ఆమె ఒక రోజు ముందు చెప్పిందని గుర్తు చేసుకున్నాడు.
మా మేడమ్ గార్కి అంకితం..
ప్లేయర్ ఆఫ్ ది అవార్డు స్వీకరించిన అనంతరం మాట్లాడిన రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను మాట్లాడే ముందు ఈ అవార్డును గుజరాత్ విద్యాశాఖ మంత్రికి అంకితం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రేపటి మ్యాచ్‌లో నువ్వు అద్భుతాలు చేస్తావని ఆమె నిన్ననే నాతో చెప్పారు. ఆమెకు నా కృతజ్ఞతలు.

ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు. బంతి సీమ్‌తో పాటు స్వింగ్ అయ్యింది. దాంతో నేను వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని అనుకున్నాను. నా తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డొనోవన్, ఇతర ఆటగాళ్లతో కూడా ఇదే చెప్పాను. టీ20 క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు కాబట్టి చివరి వరకు ఆడాలని గట్టిగా అనుకున్నాం. చివరి ఓవర్‌లో మేం 20కి పైగా పరుగులు రాబట్టగలిగాం. మా ఆలోచన కూడా అదే.
పూరన్ నా జేబులో ఉన్నాడు..
మయాంక్ యాదవ్ గాయం నుంచి కోలుకొని వచ్చి ఆ వేగంతో బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. కానీ నేను నా బలాన్ని నమ్మాను. ఒకరికొకరు సహకరించుకుంటూ మంచి క్రికెటింగ్ షాట్లు ఆడదామని నా పార్ట్‌నర్‌తో చెప్పాను. ఎందుకంటే ఈ వికెట్‌పై బంతి బాగా సీమ్ అవుతోంది. బౌన్స్ కూడా ఉంది. కాబట్టి ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఏ షాట్ పడితే అది ఆడటం కష్టం.
పూరన్ నా జేబులో ఉన్నాడు(నవ్వుతూ). పూరన్‌ను ఔట్ చేసిన తర్వాత అప్పటికప్పుడు అలా సెలెబ్రేట్ చేయాలనిపించి చేశాను. అంతకుమించి ఏం లేదు. వికెట్‌పై బంతి కొంచెం గ్రిప్ అయ్యింది. అందుకే వేగంగా బౌలింగ్ చేయాలా లేక నెమ్మదిగా వేయాలా అని ఆలోచించాను. స్లో బాల్స్ వేసినప్పుడు సహకారం లభిస్తుందని గ్రహించాను. ఆ బాల్సే కొనసాగించాను.
మిడ్ వికెట్, లాంగ్-ఆన్ సైడ్ బౌండరీలు ఇతర వైపుల కంటే కొంచెం చిన్నవిగా ఉన్నాయి. అతను ఏదో ఒక దశలో ఆ షాట్ ఆడతాడని నాకు తెలుసు. అందుకే నా పేస్‌ను మారుస్తూ నెమ్మదిగా, వైడ్, ఫుల్ లెంగ్త్ బంతులను కలిపి వేశాను. ఏది ఏమైనా ఈరోజు నేను నెమ్మదిగా బౌలింగ్ చేయాలని నిశ్చయించుకున్నాను. ఆ వ్యూహం ఫలించింది.'అని జడేజా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications