కెప్టెన్‌గా నా తొలి విజయం.. మా మేడమ్ గారికి అంకితం: రవీంద్ర జడేజా

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా నాలుగు పరాజయాల తర్వాత ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన చెన్నై 23 పరుగుల తేడాతో గెలుపొందింది. కెప్టెన్‌గా రవీంద్ర జడేజాకు ఇదే తొలి విజయం కాగా.. దీన్ని తన సతీమణి రీవా సోలంకితో పాటు తమ జట్టు ఆటగాళ్లకు అంకితమిస్తున్నానని చెప్పాడు. విజయానంతరం మాట్లాడిన జడేజా తొలి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తొలి విజయం ఎప్పటికీ ప్రత్యేకం అన్నాడు. జట్టులోని ప్రతీ ఒక్కరు అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు.

నా సతీమణికి అంకితం..
'కెప్టెన్‌గా నాకు ఇదే తొలి విజయం. ఈ విజయాన్ని నా సతీమణితో పాటు జట్టుకు అంకితమిస్తున్నాను. ఎందుకంటే తొలి విజయం ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ విజయానికి ముందు నాలుగు మ్యాచ్‌ల్లో మేం విఫలమయ్యాం. అయినా జట్టుగా బలంగా పుంజుకున్నాం. బ్యాటింగ్ విభాగంలో ప్రతీ ఒక్కరు అద్భుతంగా రాణించారు. రాబిన్ ఊతప్ప, శివమ్ దూబే అత్యద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బౌలర్లు రాణించారు. నాలుగు పరాజయాల తర్వాత కూడా మా టీమ్ మేనేజ్‌మెంట్ మమ్మల్ని ఒత్తిడి చేయలేదు. రిలాక్స్‌గా ఉంటూ మమ్మల్ని ఉత్సాహపరిచింది.

కెప్టెన్‌గా నేర్చుకుంటున్నాను..
కెప్టెన్‌గా నేను సీనియర్ ఆటగాళ్ల నుంచి నేర్చుకుంటున్నాను. మహీ భాయ్‌తో నిరంతరం చర్చలు జరుపుతున్నాను. కెప్టెన్‌గా కొత్త పాత్రను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇంకా కొంచెం టైమ్ పడుతుంది. ప్రతీ మ్యాచ్‌లో ఎంతో కొంత నేర్చుకుంటూ.. మెరుగవుతున్నాను. మా జట్టులో అనుభవానికి లోటు లేదు.
ఆ అనుభవమే మా విజయానికి కారణమైంది. నాలుగు పరాజయాల తర్వాత ఎలాంటి భయాందోళనకు గురవ్వలేదు. ప్రశాంతంగా ఉంటూ పాజిటీవ్ క్రికెట్ ఆడాము. మరింత కష్టపడ్డాం. ఈ విజయంతో మేం మూమెంటం అందుకున్నాం.. దీన్ని ఇలానే కొనసాగిస్తాం.'అని జడేజా తెలిపాడు.

శివమ్ దూబే విధ్వంసం..
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. శివమ్ దూబె ( 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 నాటౌట్), రాబిన్ ఉతప్ప ( 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 88) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అనంతరం బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది.
షాబాజ్ అహ్మద్( 27 బంతుల్లో 4 ఫోర్లతో 41), సూయాశ్ ప్రభుదేశాయ్ ( 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34), దినేశ్ కార్తీక్ ( 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) రాణించారు. ఛేదనలో చకచకా నాలుగు వికెట్లు పడ్డా బెంగళూరు పోరాడింది. తీక్షణ (4/33), జడేజా (3/39) బెంగళూరును దెబ్బతీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications