Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. ఆల్‌టైమ్ రికార్డ్!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలోనే 150 వికెట్లతో పాటు 2500 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. సౌతాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా జడేజా ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటి వరకు 47 డబ్ల్యూటీసీ మ్యాచ్‌లు ఆడిన జడేజా 150 వికెట్లు తీయడంతో 2,532 పరుగులు చేశాడు.

అంతేకాకుండా భారత గడ్డపై 250 వికెట్ల మైలు రాయి అందుకున్న నాలుగో భారత బౌలర్‌గా జడేజా నిలిచాడు. ఈ జాబితాలో అశ్విన్(383), అనిల్ కుంబ్లే(350), హర్భజన్ సింగ్(265), రవీంద్ర జడేజా(250*) కంటే ముందున్నారు.

ఒకే దేశంలో 2000 ప్లస్ రన్స్‌తో పాటు 250 వికెట్లు తీసిన రెండో ప్లేయర్‌గా జడేజా నిలిచాడు. జడేజా కంటే ముందు ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తమ సొంతగడ్డపై ఈ ఫీట్ సాధించాడు. టెస్ట్‌ల్లో 4000 పరుగులు చేయడంతో పాటు 300 వికెట్లు పడగొట్టిన నాలుగో ప్లేయర్‌‌గా నిలిచాడు. అతను 88 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు.

అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఇయాన్ బోతమ్ 72 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించి అగ్రస్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా(88), కపిల్ దేవ్(97), డానియల్ వెటోరి(101) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్‌లు ఆడిన జడేజా.. రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో 686 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 18 వికెట్లు తీసాడు.

Ravindra Jadeja Creates History Smashes Multiple World Records in Iconic Feat

సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. బ్యాటింగ్‌లో తడబడినా బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో టీమిండియా పైచేయి సాధించింది. 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 7 వికెట్లకు 93 పరుగులు చేసింది.

క్రీజులో కెప్టెన్ టెంబా బవుమా(29 బ్యాటింగ్)తో పాటు టెయిలెండర్ కోర్బిన్ బోష్(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు 37/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ 189 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, November 16, 2025, 10:27 [IST]
Other articles published on Nov 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+