Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. ఆల్‌రౌండర్‌గా వరల్డ్ రికార్డ్!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు.టెస్ట్ క్రికెట్‌లో 350 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తద్వారా టెస్ట్‌ల్లో 350 వికెట్లతో పాటు 4000కిపైగా పరుగులు చేసిన రెండో భారత ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో రవీంద్ర జడేజా ఈ ఫీట్ సాధించాడు. శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా,కేశర నువంతలను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు.

ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో 350 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా జడేజా నిలిచాడు. అతనికి ముందు అనిల్ కుంబ్లే(619), రవిచంద్రన్ అశ్విన్(537), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417) మాత్రమే 350 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటి వరకు జడేజా 4,095 పరుగులు చేశాడు. 350 వికెట్లతో పాటు 4000 ప్లస్ రన్స్ చేసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా జడేజా నిలిచాడు. కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్(ఇంగ్లండ్), డేనియల్ వెటోరి(న్యూజిలాండ్) మాత్రమే జడేజా కంటే ముందు ఈ ఫీట్ సాధించాడు.

Ravindra Jadeja Creates History Joins Elite Club with 350 Test Wickets and 4 000 Runs in Galle

అంతేకాకుండా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్లలో జడేజా మూడో స్థానంలో నిలిచాడు. రంగన హెరత్(శ్రీలంక) 433 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. డేనియల్ వెటోరి(న్యూజిలాండ్) 362 వికెట్లు, రవీంద్ర జడేజా(భారత్) 350 వికెట్లు, డెరెక్ అండర్ ‌వుడ్(ఇంగ్లండ్) 297 వికెట్లు, తైజుల్ ఇస్లామ్(బంగ్లాదేశ్) 271 వికెట్లు ఈ జాబితాలో ఉన్నారు. టెస్ట్‌ల్లో కనీసం 125 వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్లలో సౌతాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్(56.4) తర్వాత జడేజా(58.1) రెండో అత్యుత్తమ స్ట్రైక్‌రేట్‌ను కలిగి ఉండటం మరో విశేషం.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్(230 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 167) సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(175 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 82) శతకాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య(4/109) నాలుగు వికెట్లు తీయగా.. కేశర నువాంత(3/175) మూడు వికెట్లు పడగొట్టాడు. అసితా ఫెర్నాండో(2/63) రెండు వికెట్లు తీసాడు.

అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. సోనాల్ దినుషా(100) సెంచరీతో చెలరేగగా.. నిరోషన్ డిక్‌వెల్లా(115 బంతుల్లో 7 ఫోర్లతో 80) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్(4/76) నాలుగు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(3/57) మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. దాంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

Story first published: Monday, August 17, 2026, 17:09 [IST]
Other articles published on Aug 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+