Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. ఆల్‌టైమ్ రికార్డ్!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలోనే 130 ప్లస్ వికెట్లు తీయడంతో పాటు 2000 ప్లస్ రన్స్, 15 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా జడేజా ఈ ఫీట్ సాధించాడు. రిషభ్ పంత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా.. నితీష్ కుమార్‌ రెడ్డి‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. నితీష్ ఔటైనా.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి 86 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం సెంచరీ దిశగా సాగుతున్నాడు.

145/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్ బ్యాటర్స్ రిషభ్ పంత్(112 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74), కేఎల్ రాహుల్(177 బంతుల్లో 13 ఫోర్లతో 100) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించారు. లంచ్ బ్రేక్‌కు ముందే పంత్ రనౌటవ్వగా.. నితీష్-జడేజా 6 వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. దాంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.

Ravindra Jadeja Creates History First Player with 2000 Runs 15 Fifties and 100 Wickets in WTC

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. జోరూట్(199 బంతుల్లో 10 ఫోర్లతో 104) సెంచరీతో రాణించగా.. జెమీ స్మిత్(56 బంతుల్లో 6 ఫోర్లతో 51), బ్రైడన్ కార్స్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్(44), ఒలీ పోప్(44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/74) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/85), నితీష్ కుమార్ రెడ్డి(2/62) రెండేసి వికెట్లు పడగొట్టారు.

Story first published: Saturday, July 12, 2025, 22:08 [IST]
Other articles published on Jul 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+