For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లేడీ కానిస్టేబుల్‌తో రవీంద్ర జడేజా గొడవ.. ఒత్తిడి తట్టుకోలేక ఆసుపత్రిలో!!

Ravindra Jadeja Argues With Woman Cop Over Wearing Mask in Rajkot

రాజ్‌కోట్: భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వివాదంలో చిక్కుకున్నాడు. కరోనా వైరస్ రూల్స్ విషయంలో రాజ్‌కోట్‌లో సోమవారం రాత్రి ఓ లేడీ కానిస్టేబుల్‌తో జడేజా గొడవకు దిగాడు. జడేజా భార్య రవిబా కూడా లేడీ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం తెలుస్తోంది. మాస్క్ విషయంలో పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ కెరీర్‌లో జడేజా ఇప్పటివరకు 49 టెస్టుల్లో, 165 వన్డేల్లో, 49 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

జరిమానా చెల్లించాలని అడగ్గా

జరిమానా చెల్లించాలని అడగ్గా

వివరాలు ఇలా ఉన్నాయి... రవీంద్ర జడేజా, అతని భార్య రవిబా సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌కోట్ రింగ్ రోడ్‌లో కారులో వెళుతున్నారు. కారులో వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని సమాచారం. వాహన తనిఖీల్లో భాగంగా రాజ్‌కోట్ మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సోనాల్ జ్ఞానేశ్వరి.. జడేజా కారుని ఆపారు. జడ్డూ మాస్క్ ధరించగా.. అతని భార్య రవిబాకు మాత్రం మాస్క్ లేదు. మాస్క్ ధరించనందుకు జరిమానా చెల్లించాల్సిందిగా సోనాల్ ఆదేశించారు.

రోడ్డుపైనే గొడవ

రోడ్డుపైనే గొడవ

జరిమానాను నిరాకరిస్తూ రవీంద్ర జడేజా హెడ్ కానిస్టేబుల్ సోనాల్ జ్ఞానేశ్వరితో గొడవకు దిగాడు. మరోవైపు రవిబా కూడా ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో సదరు కానిస్టేబుల్‌ వాహన పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ని చూపమని జడేజాను అడగడంతో అతడు సహనం కోల్పోయి రోడ్డుపైనే ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దీంతో సోనాల్ సహచర పోలీసులు రాజ్‌కోట్ ఉన్నాతాధికారులకి సమాచారం అందించారు. తనతో కానిస్టేబుల్‌ అతిగా వ్యవహరించిందని జడేజా కూడా పోలీసులకి తెలిపాడు.

ఒత్తిడి తట్టుకోలేక

ఒత్తిడి తట్టుకోలేక

రవీంద్ర జడేజాతో గొడవపడిన నిమిషాల వ్యవధిలోనే లేడీ కానిస్టేబుల్ సోనాల్ జ్ఞానేశ్వరి‌ ఒత్తిడి తట్టుకోలేక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. గొడవపై రాజ్‌కోట్ డీసీపీ మనోహర్ ‌సిన్హా స్పందించారు. 'జడేజా తనతో దురుసు ప్రవర్తించినట్లు లేడీ కానిస్టేబుల్ సోనాల్, ఆమె తనతో దురుసుగా వ్యవహరించినట్లు జడేజా ఆరోపిస్తున్నారు. అయితే ఇద్దరూ ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం.. డ్రైవింగ్ సమయంలో జడేజా మాస్క్ ధరించి ఉన్నాడు. కానీ అతని భార్య రవిబా ఆ టైమ్‌లో మాస్క్ ధరించి ఉందా? లేదా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం' అని డీసీపీ తెలిపారు.

మోస్ట్ వాల్యూయెబుల్ క్రికెటర్

మోస్ట్ వాల్యూయెబుల్ క్రికెటర్

గత కొంతకాలంగా టెస్టు ఫార్మాట్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ అత్యద్భుతంగా రాణిస్తున్న రవీంద్ర జడేజాని 21వ దశాబ్దపు విలువైన ఆటగాడిగా (మోస్ట్ వాల్యూయెబుల్ క్రికెటర్) విజ్డన్‌ ఇండియా ఇటీవలే ప్రకటించింది. టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ తర్వాత అత్యంత వేగంగా టెస్టుల్లో 200 వికెట్లు (44 టెస్టులు) పడగొట్టిన భారత బౌలర్‌గా నిరుడు జడేజా ఘనత సాధించాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన జడేజా మూడేళ్ల వరకూ టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. కానీ 2012లో ఇంగ్లండ్‌పై తొలి టెస్టు ఆడిన జడేజా.. ఆ తర్వాత తిరుగు చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.

49 టెస్టుల్లో 1869 పరుగులు

49 టెస్టుల్లో 1869 పరుగులు

31 ఏళ్ల రవీంద్ర జడేజా ఇప్పటివరకు 49 టెస్టుల్లో 1869 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధశతకాలు, ఓ శతకం ఉన్నాయి. 2018లో వెస్టిండీస్‌పై ఆ సెంచరీ చేసాడు. అతడి ఖాతాలో 213 వికెట్లు ఉన్నాయి. ఇందులో నాలుగు సార్లు ఎనిమిది వికెట్లు, తొమ్మిది సార్లు ఐదు వికెట్లు, ఒకసారి 10 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 2.44 ఎకానమీ, 24.63 సగటు ఉంది. ఇక 165 వన్డేల్లో 187 వికెట్లు, 49 టీ20ల్లో 39 వికెట్లు పడగొట్టాడు.

ఆర్సీబీకి ఇప్పుడు ఎలాంటి బెంగ లేదు.. కోహ్లీకి ఫించ్‌ ఉన్నాడు: బ్రెట్‌లీ

Story first published: Tuesday, August 11, 2020, 15:30 [IST]
Other articles published on Aug 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+