Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సర్ఫరాజ్ నన్ను క్షమించు.. నాదే తప్పు: రవీంద్ర జడేజా

టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌‌కు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా క్షమాపణలు చెప్పాడు. తన వల్లే సర్ఫరాజ్ ఖాన్ రనౌటయ్యాడని, ఈ విషయంలో తనదే తప్పని పేర్కొన్నాడు. పెద్ద మనసుతో తనను క్షమించాలని రెండు చేతులు జోడించి సర్ఫరాజ్ ఖాన్‌ను వేడుకున్నాడు.

ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను పంచుకున్నాడు. 'సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ పట్ల చాలా బాధగా ఉంది. ఇది నా తప్పిదమే. నేను సింగిల్‌ కోసం పిలుపునిచ్చాను. నన్ను క్షమించు సర్ఫరాజ్ భాయ్.. అద్భుతంగా ఆడావ్.'అని ఇన్‌‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

 Ravindra Jadeja apologizes to Sarfaraz Khan after running him out on debut in Rajkot

అసలేం జరిగిందంటే..?
ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62) తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ టెస్ట్‌ల్లో భారత్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. స్వేచ్చగా బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ సునాయసంగా సెంచరీ చేసేలా కనిపించాడు.

కానీ రవీంద్ర జడేజా తప్పిదం కారణంగా అతను రనౌటయ్యాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అండర్సన్ వేసిన 82 ఓవర్ ఐదో బంతిని జడేజా మిడాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌కు పిలుపునిచ్చాడు. నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. జడేజా పిలుపుతో క్రీజును ధాటాడు. బంతిని ఫీల్డర్ అందుకోవడం చూసిన జడేజా యూటర్న్ తీసుకోగా.. సర్ఫరాజ్ ఖాన్ వెనక్కి పరుగెత్తే ప్రయత్నం చేశాడు.

అప్పటికే బంతిని అందుకున్న మార్క్ వుడ్ వికెట్లను డైరెక్ట్ హిట్ చేశాడు. దాంతో సర్ఫరాజ్ ఖాన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అసాధారణంగా బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ రనౌట్‌గా వెనుదిరగడం చూసి అతని తండ్రి, సతీమణితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తట్టుకోలేకపోయాడు. చివరకు రవీంద్ర జడేజా సైతం బాధపడ్డాడు. ఆ మరుసటి బంతికే అతను సెంచరీ పూర్తి చేసుకున్నా.. సెలెబ్రేట్ చేసుకోలేదు.

మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో సర్ఫరాజ్ ఖాన్ క్షమాపణలు చెప్పవచ్చు. కానీ అభిమానులందరికీ తెలిసేలా సోషల్ మీడియా వేదికగా జడేజా.. సర్ఫరాజ్ ఖాన్‌కు సారీ చెప్పాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తన ఇన్నింగ్స్ క్రెడిట్ జడేజాకు ఇచ్చాడు. అతని సహకారంతోనే హాఫ్ సెంచరీ సాధించానని తెలిపాడు.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. క్రీజులో జడేజా (212 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 110 బ్యాటింగ్) తో పాటు కుల్దీప్ యాదవ్(1 బ్యాటింగ్) ఉన్నాడు.

Story first published: Thursday, February 15, 2024, 20:00 [IST]
Other articles published on Feb 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+