Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes: ధోనీని ట్రోల్స్ చేసిన కేకేఆర్.. జడేజా అదిరిపోయే కౌంటర్!

Ravindra Jadeja and CSK Fans response to KKR trolling MS Dhoni goes viral on social media
Ravindra Jadeja's Strong Reply To KKR's Tweet On MS Dhoni | Oneindia Telugu

న్యూఢిల్లీ: కోల్‌కతానైట్‌రైడర్స్(కేకేఆర్) ఫ్రాంచైజీపై టీమిండియా స్టార్ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కేకేఆర్ ట్రోల్ చేయగా.. జడేజా దానికి కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు ఆదివారం డ్రా గా ముగిసింది. చివరి క్షణాల్లో ఇంగ్లండ్‌ ఆఖరి వికెట్‌ కాపాడుకొని ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి గట్టెక్కింది. అయితే చివరి వికెట్ కోసం ఆస్ట్రేలియా విశ్వప్రయత్నాలు చేసింది.

ధోనీ‌ని ట్రోల్ చేస్తూ..

ధోనీ‌ని ట్రోల్ చేస్తూ..

ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌ సెట్‌ చేశాడు. ఫీల్డర్లు అందరినీ బ్యాట్స్‌మెన్‌ చుట్టూనే ఏర్పాటు చేశాడు. దీంతో ఎలాగైనా ఆ ఒక్క వికెట్‌ సాధించి నాలుగో టెస్టును గెలవాలని చూశాడు. కానీ, ఆ ప్రయత్నం విఫలమై ఇంగ్లండ్‌ ఊపిరి పీల్చుకుంది. ఇదిలా ఉండగా, ఐపీఎల్‌లో ఒకసారి గౌతమ్‌ గంభీర్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ తరఫున బ్యాటింగ్‌ చేస్తున్న ధోనీకి అచ్చం ఇలాంటి ఫీల్డింగే ఏర్పాటు చేశాడు. ధోనీ డిఫెన్స్‌ను కట్టడి చేయాలని చుట్టూ నలుగురు ఫీల్డర్లను మోహరించాడు. తాజా మ్యాచ్‌లోని ఈ సన్నివేశం.. కేకేఆర్‌ జట్టుకు ఒకప్పటి గంభీర్‌ చేసిన పనిని గుర్తు చేసింది.

అది షో ఆఫ్..

దాంతో నాటి ధోనీ ఫొటోతో సహా తాజా మ్యాచ్‌లోని ఆండర్సన్‌కు ఏర్పాటు చేసిన ఫీల్డింగ్‌ ఫొటోను కేకేఆర్ ట్వీట్ చేసింది. 'టెస్టుల్లో క్లాసిక్ సన్నివేశం.. మీకు టీ20ల్లో మాస్టర్ స్ట్రోక్‌ను గుర్తు చేస్తే ఇలా ఉంటుంది' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన చెన్నైసూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్‌ జడేజా తనదైనశైలిలో స్పందించాడు. అది మాస్టర్‌ స్ట్రోక్‌ కాదు. కేవలం షో ఆఫ్‌ అంటూ నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు. మరోవైపు పలువురు ధోనీ అభిమానులు కూడా కేకేఆర్‌ టీమ్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ ఫైర్..

ఫ్యాన్స్ ఫైర్..

ఫన్నీ పోస్టులు మీమ్స్‌ షేర్ చేస్తూ కేకేఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ రెండు జట్లూ గతేడాది ఐపీఎల్ ఫైనల్లో చివరిసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 27 పరుగులతో గెలుపొంది నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. మరోవైపు చెన్నై టీమ్‌ ఐపీఎల్‌ 2022కు జడేజాను అట్టిపెట్టుకుంది. కెప్టెన్‌ ధోనీ, రుతురాజ్‌ గైక్వాడ్, మొయిన్‌ అలీలను కూడా ఆ జట్టు రిటైన్ చేసుకోవడం విశేషం. మార్చి 25 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Story first published: Monday, January 10, 2022, 14:31 [IST]
Other articles published on Jan 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+