Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravindra Jadeja: ఎవడ్రా.. టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ అని చెప్పింది.. రూమర్స్‌పై జడేజా ఫైర్!

 Ravindra Jadeja About The Rumours Retiring From The Test Cricket Puts An End

హైదరాబాద్: వరుస గాయాల నేపథ్యంలో టెస్ట్ క్రికెట్‌‌కు వీడ్కోలు పలికే ఆలోచనలో తాను ఉన్నట్లు వచ్చిన వార్తలను టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఖండించాడు. వరుస ట్వీట్లతో తన టెస్ట్ కెరీర్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఫేక్ ఫ్రెండ్స్ ఎప్పుడూ రూమర్స్‌నే నమ్ముతారని, నిజమైన దోస్తులు మాత్రం వాస్తవం తెలుసుకుంటారనే కొటేషన్‌ను ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా టెస్ట్ జెర్సీ‌లో ఉన్న ఫొటోనూ షేర్ చేసి.. కెరీర్‌లో చివరి మ్యాచ్ వరకు టెస్ట్ క్రికెట్ వదిలేది లేదని సంకేతమిచ్చాడు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్స్ వైరల్‌గా మారాయి.

అసలేం జరిగిందంటే..?

ఇటీవల వరుసగా గాయాల పాలవుతున్న ఈ స్టార్ ఆల్‌రౌండర్.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించేందుకు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుని వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించాలనే యోచనలో జడేజా ఉన్నాడని, స్వయంగా ఈ విషయాన్ని జడేజా సన్నిహితుడు ఒకరు దైనిక్ జాగరణ్ అనే పత్రికకు తెలిపారని నేషనల్ మీడియా రాసుకొచ్చింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో జడేజా మోకాలి గాయానికి గురయ్యాడు. దాంతో ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్ అతను ఆడలేదు.

మోకాలి గాయంతో..

అయితే అతని మోకాలి గాయం తీవ్రత నేపథ్యం సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. ఇక మోకాలి శస్త్రచికత్స అనంతరం కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలోనే సుదీర్ఘకాలంపాటు కెరీర్ కొనసాగించేందుకు జడేజా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని అతని సన్నిహితులు తెలిపినట్లు దైనిక్ జాగరణ్ పత్రిక పేర్కొంది. 'వరుస గాయాలవుతున్న నేపథ్యంలో రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో అతనికి మోకాలి గాయమైంది. అది తీవ్రమైన గాయమవ్వడంతో శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఐపీఎల్ 2022 సీజన్‌తో..

ఐపీఎల్ 2022 సీజన్‌తో..

ఇక ఈ సర్జరీ అనంతరం జడేజా పూర్తిగా కోలుకోవడానికి 6 నెలల సమయం పడుతుంది. దాంతో అతను సౌతాఫ్రికా పర్యటనతో పాటు వచ్చే ఏడాది శ్రీలంకతో జరిగే సిరీస్‌లకు కూడా దూరం కానున్నాడు. మళ్లీ ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడాలని జడేజా భావిస్తున్నాడు'అని సదరు వ్యక్తి తెలిపాడు. అయితే ఈ వార్తలను జడేజా తాజాగా ఖండించాడు. ఇవన్నీ గాలి వార్తలేనని స్పష్టం చేశాడు.

 బ్యాటింగ్ ఆల్‌రౌండర్..

బ్యాటింగ్ ఆల్‌రౌండర్..

ఇప్పటి వరకు 57 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జడేజా 232 వికెట్లు, 2,195 పరుగులు సాధించాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన జడేజా.. లోయరార్డర్‌లో విలువైన పరుగులు చేయగలడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇంగ్లండ్ పర్యటనలో స్పెషలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కాదని జడేజానే నాలుగు టెస్ట్‌లు ఆడించడానికి ప్రధాన కారణం కూడా అతని బ్యాటింగే. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్‌లో ఉన్న జడేజాకు త్వరలోనే సర్జరీ చేయనున్నారు.

Story first published: Wednesday, December 15, 2021, 18:22 [IST]
Other articles published on Dec 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+