ధోనీ ఉండగా.. మరో కోచ్ ఎందుకు దండుగా: అశ్విన్
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) హెడ్ కోచ్‌గా మహేంద్ర సింగ్ ధోనీని నియమించాలని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. ధోనీ ఉండగా మరో కోచ్ ఎందుకు దండగా అని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. దాంతో సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అతన్ని తప్పించి మరొకరిని హెడ్ కోచ్‌గా నియమించాలనే డిమాండ్స్ వచ్చాయి. అయితే అశ్విన్‌ను మాత్రం సీఎస్‌కే కోచ్‌గా నియమించవద్దని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు.

'కోచ్ పదవికి ఎవరినైనా సరే తీసుకోండి. కానీ రవిచంద్రన్ అశ్విన్‌ను మాత్రం తీసుకోవద్దు. మ్యాచ్‌కు ముందే తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా తుది జట్టును ప్రకటించి సొమ్ము చేసుకుంటాడు.'అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టగా.. అశ్విన్ ఘాటుగా బదులిచ్చాడు.
'నీ వాదనతో నేను ఎకీభవిస్తున్నా. నేను తుది జట్టును మ్యాచ్‌కు ముందే ప్రకటిస్తా. మా బౌలింగ్, బ్యాటింగ్ ప్రణాళికలను కూడా ప్రత్యర్థికి తెలిసేలా చేస్తాను. అలా చేయడం వల్ల అవినీతి నిరోధక విభాగాన్ని నాపై చర్యలు తీసుకునేలా చేయడమే కాకుండా.. నా వైఫల్యానికి కూడా దారితీస్తుంది. మీకు కనీసం రూల్స్ కూడా తెలియవు. అయినా ధోనీ ఉండగా.. ప్రధాన కోచ్ పదవి కోసం ఇంకెవరినో ఎందుకు వెతకాలి.'అని అశ్విన్ బదులిచ్చాడు.
తాజా సీజన్‌లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వచ్చే సీజన్‌లోనైనా ఆడుతాడా? అనే గ్యారెంటీ లేదు. రిటైర్మెంట్‌పై వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధోనీనే సీఎస్‌కే హెడ్ కోచ్‌గా నియమిస్తే సరిపోతుందనని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

