Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ ఇదేం ప్లానింగ్.. ద్రవిడ్ కోచింగ్ ఎలా ఉండేదో ఆటగాళ్లను అడగండి: అశ్విన్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికలను అతను తప్పుబట్టాడు. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌‌తో పోల్చుతూ గంభీర్‌పై ఘాటు విమర్శలు చేశాడు. రాహుల్ ద్రవిడ్ కోచింగ్ ఎలా ఉండేదో ఆటగాళ్లను అడగాలని గంభీర్‌కు చురకలంటించాడు.

రాహుల్ ద్రవిడ్ సూపర్ ప్లానింగ్‌తో 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిందని కొనియాడాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. ద్రవిడ్ బ్లూప్రింట్‌ను 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డాడు.

IND vs ZIM టీ20 సిరీస్: జియోస్టార్, సోనీ టీవీలో రాదు.. ఎలా చూడాలంటే?

IND vs ZIM టీ20 సిరీస్: జియోస్టార్, సోనీ టీవీలో రాదు.. ఎలా చూడాలంటే?

నాలుగేళ్ల ప్రణాళికలను ముందే తయారు చేయాలి..

'ఈ విషయాన్ని ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పాను. 2023 వన్డే ప్రపంచకప్ ముగిసిన వెంటనే తర్వాతి మెగా టోర్నీ కోసం నాలుగేళ్ల పాటు జట్టును ఎలా నడిపించాలి? ఏ కాంబినేషన్లను కనుగొనాలి? వన్డే ఫార్మాట్ స్పెషలిస్ట్‌లు ఎవరు? టీమ్‌మేనేజ్‌మెంట్ ఎవరికి మద్దతు ఇవ్వాలి? ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను ఎలా సమన్వయం చేయాలి? అనే ప్రణాళికలను రూపొందించాల్సింది.

2023 వన్డే ప్రపంచకప్ సమయంలో రాహుల్ భాయ్ కోచ్‌గా ఉన్నారు. ఆయనే ఈ ప్రణాళికలను సిద్దం చేసి ఉండాల్సింది. కోచ్‌గా తప్పుకున్నా.. ఆ ప్రణాళికలను రికార్డు చేసి తదుపరి కోచ్‌కు ఇవ్వాల్సింది. 'ఇది నా ప్లాన్.. ఈవిధంగా అమలు చేయండి'అని చెప్పాల్సింది.

Ravichandran Ashwin Slams Gautam Gambhir s 2027 WC Planning Says Ask Players How Was Rahul Dravid As Coach

విమర్శలు వచ్చినా ప్రణాళికల్లో లోపం లేదు..

ద్రవిడ్ హయాంలో చాలా మంది కెప్టెన్లు అయ్యారని, ఆ సమయంలో అతనిపై చాలా విమర్శలు వచ్చాయని హోస్ట్ అశ్విన్‌కు గుర్తు చేశాడు. దానికి అశ్విన్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ఓ వామప్ మ్యాచ్‌లో తాను కూడా సారథిగా వ్యవహరించానని తెలిపాడు. ద్రవిడ్ నిర్ణయాలపై విమర్శలు వచ్చినా.. అతని ప్రణాళికల్లో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశాడు. ద్రవిడ్ హయాంలో నెలకొన్న స్థిరత్వానికి ఆటగాళ్లందరూ సాక్ష్యం చెబుతారని అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ, రోహిత్‌ను టచ్ చేయలేరు.. మా బౌలర్ల పరిస్థితి వేరు : అశ్విన్

కోహ్లీ, రోహిత్‌ను టచ్ చేయలేరు.. మా బౌలర్ల పరిస్థితి వేరు : అశ్విన్

'వెస్టిండీస్‌లో జరిగిన ఓ ప్రాక్టీస్ గేమ్‌లో నేను భారత్-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాను. మేం సరైనా ప్లానింగ్‌తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఔట్ చేశాం. ద్రవిడ్‌పై కూడా విమర్శలు రావచ్చు. కానీ ద్రవిడ్ ప్లానింగ్ సరిగ్గా లేదని, ఎవరికైనా తగిన అవకాశాలు ఇవ్వకుండా పక్కనపెట్టారని గానీ ఎవరైనా చెప్పగలరా? హార్దిక్ పాండ్యాను ద్రవిడ్ కాపాడుకున్న విధానం అద్భుతం. దురదృష్టవశాత్తు 2023 వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. అది వేరే విషయం.

కానీ ద్రవిడ్ నిర్మించిన జట్టు అద్భుతం. శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా తీర్చిదిద్దాడు. కేఎల్ రాహుల్‌కు అండగా నిలిచాడు. అతని హయాంలోనే రాహుల్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. విదేశీ పర్యటనల్లో శార్దూల్ ఠాకూర్‌కు8వ స్థానంలో సుదీర్ఘ కాలం అవకాశాలు ఇచ్చాడు. మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించారు.

ఆటగాళ్లను అడగండి..

రాహుల్ ద్రవిడ్‌తో నేను చాలా దగ్గరగా పనిచేశాను. అతని హయాంలో ఆటగాళ్లు ఎప్పుడూ స్థిరత్వం లేదని భావించలేదు. రాహుల్‌ భాయ్‌‌పై విమర్శలు రాలేదని నేను చెప్పడం లేదు. అత్యుత్తమ ఆటగాళ్లకు కూడా విమర్శలు తప్పవు. సోషల్ మీడియా విమర్శలను పక్కనపెట్టండి. అవి ముఖ్యం కాదు. కానీ రాహుల్ భాయ్ కోచింగ్ కాలంలో పని చేసిన ఏ ఆటగాడినైనా.. ' కోచ్‌గా రాహుల్ భాయ్ ఎలా ఉండేవారు?'అని అడగండి. అప్పుడు నాతో మాట్లాడండి. రాహుల్‌ భాయ్‌గా పర్‌ఫెక్ట్‌గా పని చేసే వ్యక్తి ఎవరైనా ఉంటారా?'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, July 22, 2026, 10:48 [IST]
Other articles published on Jul 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+