అభిషేక్ కాదు.. అతని వల్లే SRH గెలిచింది: అశ్విన్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌పై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. అక్షర్ పటేల్ చెత్త కెప్టెన్సీతోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని తెలిపాడు. ప్రధాన బౌలర్లు ఉండగా పార్ట్ టైమ్ బౌలర్లతో బౌలింగ్ చేయించి అక్షర్ మూల్యం చెల్లించుకున్నాడని అభిప్రాయపడ్డాడు.
మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల భారీ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. అభిషేక్ శర్మ(68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 135 నాటౌట్) అజేయ శతకంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అభిషేక్ శర్మను ఔట్ చేయాలనే ప్రయత్నంలో అక్షర్ పటేల్ ప్రధాన బౌలర్లను పక్కనపెట్టి మరీ పార్ట్‌టైమ్ స్పిన్నర్ అయిన నితీష్ రాణాకు నాలుగో ఓవర్లు ఇచ్చాడు. రానా ఈ 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నిర్ణయాన్ని అశ్విన్ తప్పుబట్టాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మ్యాచ్‌ను విశ్లేషించిన అశ్విన్.. అక్షర్ పటేల్‌పై విమర్శలు గుప్పించాడు. 'అక్షర్ పటేల్ అనాలోచిత నిర్ణయం ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించింది. జట్టులో కట్టడిగా బౌలింగ్ చేసే బౌలర్లు ఉండగా.. నితీష్ రాణాతో నాలుగు ఓవర్లు వేయించడం దారుణం. కొన్నిసార్లు అద్భుతమైన బౌలర్లు కూడా ఎక్కువగా పరుగులిస్తారు. క్వాలిటీ బౌలర్ అయిన నటరాజన్ 40 పరుగులే ఇచ్చాడు. అలా అని కీలక బౌలర్లను పక్కనపెట్టకూడదు.
వారు 50 పరుగులు ఇచ్చినా ఫర్వాలేదు. ముందుగా ప్రధాన బౌలర్ల ఓవర్లనే పూర్తి చేయాలి. అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్ తీసినా.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి 21 పరుగులే ఇచ్చినా తన కోటాను పూర్తి చేయలేకపోయాడు. తొలి రెండు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చుకున్న కుల్దీప్ యాదవ్‌కు మరో ఓవర్ ఇవ్వలేదు. కుల్దీప్ యాదవ్ మ్యాచ్ విన్నర్. ప్రారంభంలో పరుగులు ఇచ్చినా మధ్య ఓవర్లలో వికెట్లు తీసి ఆటను మలుపు తిప్పగలడు. అక్షర్ అనాలోచిత నిర్ణయాలే ఢిల్లీ ఓటమిని శాసించాయి.’అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications