Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గల్లీ క్రికెట్ ఆడినట్లే ఆడు బిడ్డా: అశ్విన్

అంతర్జాతీయ అరంగేట్రానికి టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సిద్దమయ్యాడు. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగే అవకాశం ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థి పసికూన ఐర్లాండే అయినా.. వైభవ్ అరంగేట్రం కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో మాజీ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీకి పలు సూచనలు చేస్తున్నారు.

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ మధ్య వాగ్వాదం! (వీడియో)

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ మధ్య వాగ్వాదం! (వీడియో)

భారత జట్టు తరఫున ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదించాలని వైభవ్ సూర్యవంశీకి టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ సూచించాడు. 'వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల కుర్రాడు. తన సొంత ఊరిలోని గల్లీల్లో ఆడుతున్నట్లుగానే.. అంతర్జాతీయ క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆడాలి. ఎందుకంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం ఎక్కువ కాలం ఉండదు.

Handle the Hype Ravichandran Ashwin Shares Crucial Advice for Young Prodigy Vaibhav Sooryavanshi Ahead of T20I Debut

చివరికి అది ఒక బాధ్యతగా.. పనిగా మారుతుంది. దాంతో ఒత్తిడి ప్రభావం కనిపిస్తుంది. కానీ.. ప్రస్తుతానికి అతను ఆనందంగా ఆడుతూ మనందరినీ అలరించాలని కోరుకుంటున్నా . వైభవ్ ప్రత్యేకమైన ప్లేయర్. అతని బ్యాటింగ్ శైలే కాకుండా.. బౌలర్లకనుగుణంగా అతని ఆటలో చేసుకున్న చిన్న చిన్న మార్పులు కూడా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.'అని అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తాటతీస్తాం: బుడ్డోడికి ఐర్లాండ్ కెప్టెన్ ఓపెన్ ఛాలెంజ్!

తాటతీస్తాం: బుడ్డోడికి ఐర్లాండ్ కెప్టెన్ ఓపెన్ ఛాలెంజ్!

వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 15 ఏళ్ల వైభవ్ కోసం జట్టులో ఎంతో కాలంగా ఆడుతున్న ఆటగాళ్లను పక్కనపెట్టలేమని, అలా చేయడం కూడా అన్యాయమని బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కోటక్ అనడం వైభవ్ అరంగేట్రంపై సందేహాలు నెలకొనేలా చేసింది. మరోవైపు వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ పంచుకోవడం.. ఈ సిరీస్ అధికార బ్రాడ్‌కాస్టర్ సోనీ నెట్‌వర్క్ కూడా వైభవ్‌ను ముందు పెట్టి ప్రచారం చేస్తుండటం అతని అరంగేట్రం ఖాయమనే అభిప్రాయాన్ని కలగజేస్తోంది.

Story first published: Friday, June 26, 2026, 16:00 [IST]
Other articles published on Jun 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+