For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా ప్రపంచకప్ గెలవాలంటే.. ఆ కుర్రాడిని తీసుకోవాలి: అశ్విన్

చెన్నై: టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం ఠాకూర్ తిలక్ వర్మపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. తిలక్ వర్మను ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అతని చేరికతో టీమిండియా మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుందని తెలిపాడు. తిలక్ వర్మను ఇబ్బంది పెట్టే బౌలర్ ఏ టాప్‌ టీమ్‌లో లేడని, అతను ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ.. (39, 51, 49 నాటౌట్) వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రాణించాడు. 69.50 యావరేజ్‌ 139 స్ట్రైక్‌రేట్‌తో 139 పరుగులు చేశాడు. సహచర యువ ఆటగాళ్లు, పలువు స్టార్ ప్లేయర్లు వెస్టిండీస్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతుంటే తిలక్ వర్మ మాత్రం అలవోకగా షాట్లు కొడుతూ పరుగులు రాబడుతున్నాడు.

Ravichandran Ashwin says Tilak Varma could be the X-factor in ODI World Cup 2023

ఇప్పటి వరకు అతనే టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఫియర్‌లెస్ షాట్లు కొడుతూ.. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని బ్యాటింగ్ ఫిదా అవుతున్న మాజీ క్రికెటర్లు మంచి భవిష్యత్తు ఉందని కొనియాడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే తిలక్ తిరుగుండదని జోస్యం చెబుతున్నారు.

ప్రస్తుతం టీమిండియా లెఫ్టాండర్ బ్యాటర్ల కోసం చూస్తోంది. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మను జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్ బలహీనతను అధిగమించవచ్చని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్ చేస్తున్న తిలక్ వర్మ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అవుతాడని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్‌ వేదికగా తెలిపాడు.

'వరల్డ్ కప్ టీమ్‌లో చోటు కోసం చాలా పోటీ ఉంది. అయితే లెఫ్టాండర్ కావడం తిలక్ వర్మకు కలిసొచ్చే అంశం. తిలక్ వర్మను ఇబ్బంది పెట్టే క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్లు ప్రస్తుతం ఏ టాప్ టీమ్‌లోనూ లేరు. అందుకే వరల్డ్‌కప్‌లో తాను ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు.'అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఫిట్‌గా లేరని వార్తలు వస్తున్న నేపథ్యంలో తిలక్ వర్మను ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించాడు. 'వెస్టిండీస్‌తో టీ20ల్లో తిలక్‌ వర్మ ఆట నన్నెంతో ఆకట్టుకుంది. అలాంటి కుర్రాడు మ్యాచ్‌లను ముగిస్తుంటే చూడముచ్చటగా ఉంది.

ఇప్పుడు వన్డే జట్టు కోసం భారత్‌ పరిశీలించదగ్గ ఆటగాళ్లలో తిలక్‌ వర్మ ఒకడు. టీ20ల్లో తిలక్‌ పరిణతి చూస్తే వన్డేలకూ సరిపోతాడని అనిపిస్తోంది. శ్రేయస్‌, రాహుల్‌ ఇంకా ఆటకు సిద్ధంగా లేరంటున్న నేపథ్యంలో తిలక్‌ వర్మను ఎందుకు ఎంపిక చేయకూడదు? పైగా అతను లెఫ్టాండర్ కూడా'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, August 10, 2023, 8:56 [IST]
Other articles published on Aug 10, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+