For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పవర్ ప్లేలోనే ఫలితం వస్తుంటే.. బౌలర్లు ఏం చేస్తారు: అశ్విన్

Ravichandran Ashwin says sometimes we can lose during the match in powerplay over T20 WC exit

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వైఫల్యానికి బలహీనమైన బౌలింగే ప్రధాన కారణమని వచ్చిన విమర్శలను వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుబట్టాడు. టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్లదే రాజ్యమని గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్న అశ్విన్.. పవర్ ప్లేలోనే ఫలితం తేలుతుంటే బౌలర్లు ఏం చేస్తారని ప్రశ్నించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ప్రపంచకప్ వైఫల్యంపై సుదీర్ఘంగా మాట్లాడిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌లో క్రికెట్‌ను ఓ మతంలా ఆరాధించడం వల్లే టీమిండియా సెమీఫైనల్ చేరినా.. చిన్నదిగా కనిపిస్తోందన్నాడు. టీమిండియా ఓ ద్వైపాక్షిక సిరీస్ ఓడిపోయినా ఇక్కడి జనాలు తట్టుకోలేరని పేర్కొన్నాడు. భారత జట్టు ఓటమిని కూడా ఇక్కడ న్యూస్ చానెల్స్‌లో చర్చిస్తారని, యుద్దమే ఓడినంత బిల్డప్ ఇస్తారని చెప్పుకొచ్చాడు. దీనంతటికి టీమిండియాపై జనాలు పెట్టుకున్న భారీ అంచనాలే కారణమని తెలిపాడు.

మార్జిన్స్ చాలా చిన్నగా..

మార్జిన్స్ చాలా చిన్నగా..

'టీ20 ఫార్మాట్‌లో మార్జిన్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఒక బంతి లేదా పరుగు తేడాతో ఓటమి ఎదురవ్వచ్చు. కొన్నిసార్లు పవర్ ప్లేలో కూడా మ్యాచ్ కోల్పోవాల్సి ఉంటుంది. పవర్ ప్లేలో మనం 30 పరుగులే చేసినప్పుడు ప్రత్యర్థి జట్టు 60 పరుగులు చేస్తే మ్యాచ్ అక్కడే ముగుస్తోంది. కానీ చాలా మందికి ఈ లెక్కలు ఏం తెలియకుండా మాట్లాడుతారు. టీ20 ఫార్మాట్‌లో కొన్నిసార్లు పవర్ ప్లేతోనే ఫలితం తేలిపోతుంది. కాబట్టి టీ20ల్లో అనేక ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది.

భారీ అంచనాలే..

భారీ అంచనాలే..

ఇక భారత్‌లో క్రికెట్‌ను మతంలా ఆరాధిస్తారు. అందుకే టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లో ఓడినా బిగ్ న్యూస్ అవుతుంది. న్యూస్ చానెల్స్ అన్నీ చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. జట్టులో ఎవర్నీ తీసేయాలి.. ఎవర్నీ ఆడించాలనే విషయాలపై చర్చలు జరుపుతాయి. ప్రపంచ యుద్దమే ఓడినంత రచ్చ చేస్తాయి. టీమిండియాపై జనాలు పెట్టుకున్న అంచనాలే దీనికి ప్రధాన కారణం. ఈ సారి మేం ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓడినా వారికది అవమానకరంగానే అనిపించింది. టైటిల్ గెలవడమే వారికి కావాలి.'అని అశ్విన్ చెప్పాడు.

వీలైనన్నీ ప్రయోగాలు..

వీలైనన్నీ ప్రయోగాలు..

ఇవన్నీ దృష్టిలోపెట్టుకొని అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమ్‌ను సిద్దం చేయాలని అశ్విన్ సూచించాడు. మెగా టోర్నీ వరకు ఆటగాళ్లతో వీలైనన్నీ ప్రయోగాలు చేయాలన్నాడు. రిషభ్ పంత్‌ను అప్‌దీ ఆర్డర్‌లో ఆడించడం, సంజూ శాంసన్‌కు ఫినిషర్‌ రోల్ ఇవ్వడం వంటివన్నీ మెగా టోర్నీకి ముందే ప్రయోగించాలన్నాడు. ఇక ఈ ప్రయోగాలపై తనకున్న అభ్యంతరాలను కూడా అశ్విన్ తెలియజేశాడు. అయితే టీ20 ప్రపంచకప్ 2022లో భారత జట్టు వైఫల్యానికి బలహీనమైన బౌలింగ్ కాదని చెప్పే ప్రయత్నం అశ్విన్ చేసాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పవర్ ప్లేలో ఫలితం తేలుతుందన్న వ్యాఖ్యలతో తాము ఏకీభవించమని కామెంట్ చేశాడు.

Story first published: Saturday, November 19, 2022, 15:19 [IST]
Other articles published on Nov 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+