Ravichandran Ashwin:అతను ధోనీకి లెఫ్టాండ్ వర్షన్!
టీమిండియా నయా ఫినిషర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సెన్సేషన్ రింకూ సింగ్‌పై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతను మహేంద్ర సింగ్ ధోనీకి లెఫ్టాండ్ వర్షన్ అని కొనియాడాడు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా కేకేఆర్ టీమ్ గురించి మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్.. రింకూ సింగ్‌ను ఆకాశానికెత్తాడు.
గతేడాది కంటే ఈ సారి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో రింకూ సింగ్ ఐపీఎల్ బరిలోకి దిగుతున్నాడని చెప్పాడు. 'ముందుగా గత ఐపీఎల్ నుంచి అప్‌కమింగ్ సీజన్ వరకు రింకూ సింగ్ ఎదిగిన తీరు అద్భుతం. గతేడాది అతను అసాధారణమైన ప్రదర్శన కనబర్చాడు. ఈ ఏడాది టీమిండియా తరఫున బరిలోకి దిగి మరింత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు.

చంద్రముఖిలా మారుతూ..
ప్రస్తుతం అతని ఆలోచన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. 'మీరు ఎలాగైనా బంతులు వేయండి.. నేను ఆఖరి బంతి వరకు నిలబడి పరుగులు చేస్తాను'అనే ఆలోచన ధోరణితో రింకూ సింగ్ ఉన్నాడు. చంద్రముఖి సినిమా క్లైమాక్స్‌లో గంగ ఎలా చంద్రముఖిలా మారుతుందో.. రింకూ సింగ్ కూడా ధోనీకి లెఫ్టాండ్ వర్షన్‌గా మారిపోతాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
గతేడాది కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రింకూ సింగ్ నిలిచాడు. 14 ఇన్నింగ్స్‌ల్లో 59.25 సగటు.. 149.52 స్ట్రైక్‌రేట్‌తో 474 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో చివరి 5 బంతుల్లో 5 సిక్స్‌లు బాది సంచలన విజయాన్ని అందించాడు. ఈ ప్రదర్శనతో అతను యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.
అయ్యర్ రీఎంట్రీతో..
ఇక శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వడం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లపై అయ్యర్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తాడని, ఇది ఆ జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పాడు. 'శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ కేకేఆర్ బలాన్ని పెంచుతోంది. అతను స్పిన్‌ను సమర్థవంతంగా ఆడగలడు.
కోల్‌కతా వంటి చిన్న మైదానాల్లో అతను మరింత చెలరేగగలడు. కెప్టెన్‌గా.. ఓ బలమైన భారత ఆటగాడిగా జట్టుకు అన్ని విధాల ఉపయోగపడనున్నాడు.'అని అశ్విన్ తెలిపాడు. వెన్ను గాయంతో గతేడాది శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడలేదు. దాంతో కేకేఆర్ జట్టును నితీష్ రాణా నడిపించాడు.
మిచెల్ స్టార్క్ సైతం..
కేకేఆర్ జట్టులోకి కొత్తగా వచ్చిన మిచెల్ స్టార్క్ కూడా రాణిస్తాడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. టోర్నీ చరిత్రలోనే మరేవరికి దక్కని రూ. 24.75 కోట్ల ప్రైజ్‌ను సొంతం చేసుకున్న మిచెల్ స్టార్క్ ఈ హయ్యెస్ట్ ప్రైజ్ ట్యాగ్ ఒత్తిడిని ఎలా అధిగమిస్తాడా? అనేది చూడాలి. ఆర్‌సీబీ తరఫున అతను గతంలో రాణించాడని, కేకేఆర్ తరఫున కూడా అతను సత్తా చాటగలడని అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు.
'కోల్‌కతాకు ఓ డెత్ బౌలర్ అవసరం ఏర్పడింది. దాంతో మిచెల్ స్టార్క్ కోసం తీవ్రంగా పోటీపడింది. ఇప్పటి వరకు అయితే హయ్యెస్ట్ ట్యాగ్ ప్రైజ్ కలిగిన ఆటగాళ్లు అయితే పెద్దగా రాణించలేదు. కానీ మిచెల్ స్టార్క్ సత్తా చాటుతాడు. గతంలో అతను ఆర్‌సీబీ తరఫున సత్తా చాటాడు. ఆ ప్రదర్శననే పునరావృతం చేయగలడు. ఆండ్రూ రస్సెల్ సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 నేపథ్యంలో అతను ఆకాశమే హద్దుగా చెలరేగనున్నాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications