For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండు ప్రపంచకప్‌ల్లో టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం అదే: రవి చంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin says “Once Zaheer Khan Retired, India Haven’t Found A Proper Left-Arm Seamer”

న్యూఢిల్లీ: 2019 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం జట్టులో లెఫ్టార్మ్ పేసర్ లేకపోవడమేనని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. జహీర్ ఖాన్ తర్వాత టీమిండియా మరో లెఫ్టార్మ్ పేసర్‌ను సిద్దం చేసుకోలేకపోయిందని తెలిపాడు. లెఫ్టార్మ్ పేసర్ జట్టులో లేకపోవడంతో.. భారత బ్యాటర్లు స్వింగ్‌కు చేతులెత్తేస్తున్నారని చెప్పాడు. లెఫ్మార్మ్ పేసర్లు వేసే ఇన్ స్వింగ్ డెలివర్లు చాలా భిన్నంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు.

లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కొన్న అనుభవం లేకనే.. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా బ్యాటర్లు ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యారని గుర్తు చేశాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌లో కూడా భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారని తెలిపాడు.

'జహీర్ ఖాన్ వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా సరైన లెఫ్టార్మ్ పేసర్‌ను సిద్దం చేసుకోలేకపోయింది. లెఫ్టార్మ్ పేసర్‌ను ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు ఇబ్బంది పడడానికి ప్రధాన కారణం ఇదే. 2019 వన్డే ప్రపంచ కప్‌లో ట్రెంట్ బౌల్ట్ బంతిని స్వింగ్ చేసి విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు.లెఫ్టార్మ్ పేసర్ స్వింగ్‌ను ఎదుర్కోవడం చాలా భిన్నంగా ఉంటుంది.

నెట్స్‌లో విరాట్ కోహ్లీ.. బుమ్రా, షమీ, ఉమేశ్ యాదవ్‌ల బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేస్తాడు. ఈ ముగ్గురూ అద్భుతమైన బౌలర్లే.. అయినా లెఫ్టార్మ్ పేసర్ వచ్చేసరికి, ఆ యాంగిల్ పూర్తిగా మారిపోతుందని చెప్పాడు.

ఎంత మంది కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్లు ఇన్‌స్వింగర్లు వేయగలరు? సరైన లెఫ్టార్మ్ పేసర్ లేనంత వరకూ భారత్ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేదు. మిచెల్ స్టార్క్ ఆల్‌టైం గ్రేట్ అయ్యే పనిలో ఉన్నాడని షాన్ టైట్ చెప్పాడు. నన్ను అడిగితే అతను ఇప్పటికే లెజెండ్స్ సరసన నిలిచాడు. గ్లేన్ మెక్‌గ్రాత్ లాంటి లెజెండరీ బౌలర్లను ప్రపంచానికి అందించిన ఆస్ట్రేలియా.. వన్డేల్లో మిచెల్ స్టార్క్‌ను తీసుకొచ్చింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ బ్రెట్ లీ బౌలింగ్‌తో సమానంగా ఉంటుంది. నా అంచనా ప్రకారం వన్డే ఫార్మాట్‌లో స్టార్క్, బ్రెట్ లీని దాటేస్తాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, March 24, 2023, 22:16 [IST]
Other articles published on Mar 24, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+