WTC Final: వారి ఆట మాకో పాఠం.. ఆస్ట్రేలియా విజయాన్ని రిపీట్ చేస్తాం!

చెన్నై: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ముందు ఆటగాళ్లకు సుదీర్ఘ విరామం రావడం ఇబ్బందికరమైన విషయమేనని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడటం న్యూజిలాండ్‌కు ప్రయోజనకరమని తెలిపాడు. అయితే వారి ఆటను జాగ్రత్తగా పరిశీలిస్తే తమకు ఓపాఠం అవుతుందని పేర్కొన్నాడు. ప్రాక్టీస్‌కు తగిన సమయం లేకున్నా ఆస్ట్రేలియాలో మాదిరిగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్దంతరంగా వాయిదా పడటంతో ఆటగాళ్లంతా గత కొద్ది రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే మెగా ఫైనల్ కోసం టీమిండియా.. గురువారం ఇంగ్లండ్ బయల్దేరనుంది. అక్కడ మరో 10 రోజులు ఐసోలేషన్‌లో ఉండనుంది. అయితే మరోవైపు న్యూజిలాండ్ మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందే ఇంగ్లండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.

బిగ్ చాలెంజ్..
అయితే తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మా ప్రాక్టీస్ మొదలయ్యేందుకు కనీసం మరో వారం పది రోజులు పడుతుంది. ఐపీఎల్ వాయిదా పడ్డప్పటి నుంచి ఆటగాళ్లు క్రికెట్ ఆడలేదు. ఇది మాకు పెద్ద సవాలే. కానీ ఒక్కసారి ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాక టీమిండియా త్వరగా పరిస్థితులకు అలవాటు పడగలదు. ఆస్ట్రేలియాలో మాదిరిగా ప్రదర్శనలు చేయగలదు' అని అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు..

వారి ఆట మాకు పాఠం...
'మ్యాచ్‌కు సన్నద్ధమవ్వడం, మ్యాచ్ కోసం సాధన చేయడం భిన్నమైనవి. ఐపీఎల్ వాయిదా పడ్డాక మేం ఇంగ్లాండ్ వెళ్తున్నాం. ఇంగ్లండ్‌తో ఆడే రెండు టెస్టులు కివీస్‌కు అనుభూతిని ఇస్తాయి. అదే సమయంలో వారి మ్యాచులు చూడటం మాకు విలువైన పాఠాలు అవుతాయి. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగే మ్యాచులు చూడటం, పాత వీడియోలు చూడటం ప్రయోజనకరం' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

రిషభ్ పంత్ కీలకం..
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో రిషభ్ పంత్ కీలక పాత్ర పోషిస్తాడని యాష్ తెలిపాడు. 'రిషభ్ పంత్ ఎలాంటి ఆటగాడో మనందరికి తెలిసిందే. ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేయగలడు. పంత్ లాంటి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ఉండటం, ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం జట్టుకు కలిసొచ్చే అంశం. అతని వల్ల టీమ్ ఐదుగురి బౌలర్లతో బరిలోకి దిగవచ్చు. అతని సహజమైన, నిర్భమైన ఆటతీరు అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారత జట్టు ముంబైలో క్వారంటైన్ అయిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వెళ్లాక మళ్లీ మూడు రోజులు హార్డ్ క్వారంటైన్‌లో ఉండి, ఆ తర్వాత ప్రాక్టీస్ షురూ చేయనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications