For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేనే కెప్టెన్‌గా ఉంటే బెన్ స్టోక్స్ తిక్క కుదుర్చేవాడిని: అశ్విన్ (వీడియో)

ఇంగ్లండ్ కెప్టెన్‌ బెన్ స్టోక్స్‌పై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం ముగిసిన నాలుగో టెస్ట్ చివర్లో బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ప్రవర్తన సరికాదని మండిపడ్డాడు. తానే టీమిండియా కెప్టెన్‌గా ఉండి ఉంటే బెన్ స్టోక్స్ తిక్క కుదుర్చేవాడినని తెలిపాడు. డ్రాకు అస్సలు ఒప్పుకోకపోయేవాడినని, ఆఖరి 15 ఓవర్లు కూడా ఆడించేవాడినని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా అసాధారణ ప్రదర్శనతో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది.

అసలేం జరిగిందంటే..?

అద్వితీయమైన బ్యాటింగ్‌తో రాణించిన జడేజా, సుందర్‌ల సెంచరీలను అడ్డుకోవాలనే దురుద్దేశంతో బెన్ స్టోక్స్ నిర్ణీత సమయం కన్నా ముందే డ్రాకు ప్రతిపాదించాడు. అయితే ఈ విజ్ఞప్తికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. దాంతో సహనం కోల్పోయిన బెన్ స్టోక్స్.. భారత ఆటగాళ్లను అవమానపర్చేలా మాట్లాడాడు. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్‌లో సెంచరీలు చేస్తారా? అని హేళన చేశాడు.

Ravichandran Ashwin Says He Would Have Let India Bat Full 15 Overs as Captain

ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇంత హేళన చేసినా.. సహనం కోల్పోని జడేజా.. డ్రా అనేది తమ చేతుల్లో లేదని చెప్పాడు. ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకున్న అనంతరం భారత్‌కు డ్రాకు అంగీకరించడంతో మ్యాచ్ ముగిసింది. అయితే జడేజాపై కోపంతో బెన్ స్టోక్స్ అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అసహనం వ్యక్తం చేస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు. బెన్ స్టోక్స్ తీరుపై ఓ జర్నలిస్ట్‌తో మాట్లాడిన అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

హ్యారీ బ్రూక్‌తో ఎవడు వేయించమన్నాడు..?

'ద్వంద వైఖరి అనే పదాన్ని ఎప్పుడైనా విన్నారా? ఆ పదం అర్థం కావాలంటే నాలుగో టెస్ట్ ఆఖరి పది నిమిషాల ఆటను చూడాలి. ఇంగ్లండ్‌కు నిరాశ ఎదురైందని, భారత్‌కు అలాంటి ఫిలింగే కలగాలని కోరుకోవడం ఏంటి? హ్యారీ బ్రూక్ బౌలింగ్‌లో సెంచరీ చేస్తావా? అని స్టోక్స్ అన్నాడు. అసలు హ్యారీ బ్రూక్‌తో బౌలింగ్ ఎవడు చేయించమన్నాడు. స్టీవ్ హర్మిసన్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను తీసుకొచ్చి వేయించు. ఎవరు వద్దన్నారు? హ్యారీ బ్రూక్‌తో బౌలింగ్ చేయించడం మీ తప్పు. భారత్‌ది కాదు.

నేనైతే తిక్క కుదిర్చేవాడిని..

డ్రా కోసం ఇరు జట్లు అంగీకరించికొని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలనే రూల్ ఉంది. అయితే స్టోక్స్ ముందుగా మ్యాచ్‌ను ముగించేందుకు రెండు కారణాలు చెప్పాడు. తమ బౌలర్లు అలసిపోవద్దనే కారణం ఒకటైతే.. నేను నిరాశ చెందానని రెండో కారణం చెప్పాడు. ఇంగ్లండ్ నిరాశకు గురైందని భారత్‌కు సంతోషం కలగవద్దని కోరుకోవడం ఏంటి? వారి బౌలర్లు అలసిపోవద్దని భారత్ డ్రాకు అంగీకరించాలా? ఇదెక్కడి వాదన. నేనే కెప్టెన్‌గా ఉండి ఉంటే మాత్రం డ్రాకు అస్సలు అంగీకరించేవాడిని కాదు. బెన్ స్టోక్స్ తిక్క కుదిరేలా.. చివరి 15 ఓవర్లు కూడా ఆడించేవాడిని.'అని అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Story first published: Monday, July 28, 2025, 17:48 [IST]
Other articles published on Jul 28, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+