Ravichandran Ashwin: ఐపీఎల్ 2022 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ నాతో పాటు అతన్ని కూడా రిటైన్ చేసుకోదు!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్ మేగా వేలాన్ని ఉద్దేశించి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు తాను ప్రాతినిథ్యం వహించిన ఢిల్లీ క్యాపిటల్స్.. తనను ఎట్టి పరిస్థితుల్లో రిటైన్ చేసుకోదన్నాడు. తననే కాకుండా ఢిల్లీ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కూడా ఎంచుకోదని అంచనా వేసాడు.
ఇక లీగ్ విస్తృతిని పెంచాలనే లక్ష్యంతో జట్ల సంఖ్యను పదికి పెంచిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. కొత్త జట్ల నియామక కార్యచరణను కూడా పూర్తి చేసింది. ఇప్పుడు మెగా వేలం నిర్వహణపై కసర్తతులు చేస్తుంది. ఇప్పటికే ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని ఫ్రాంచైజీలకు తెలియజేసి.. నవంబర్ 30లోపు రిటెన్షన్ జాబితాను అందించాలని ఆదేశించింది. డిసెంబర్ చివరి వారంలో మెగా వేలం నిర్వహించాలని భావిస్తోంది.

నిబంధనల కారణంగానే..
ఇక బీసీసీఐ రిటెన్షన్ పాలసీ నిబంధనల ప్రకారం.. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలి. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి. నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది.

ఆ నలుగురికి చాన్స్..
ఈ రిటెన్షన్ పాలసీ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ తనతో పాటు శ్రేయస్ అయ్యర్‌ను రిటైన్ చేసుకునే ఆలోచనలో లేదని అశ్విన్ స్పష్టం చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. ఐపీఎల్-2021 సీజన్‌లో జట్టును టేబుల్ టాపర్‌గా నిలిపిన కెప్టెన్ రిషభ్ పంత్, యువ ఆటగాడు పృథ్వీ షా, సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జ్, కగిసో రబడాలను అట్టిపెట్టుకునే అవకాశం ఉందన్నాడు. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్‌ను సైతం యాజమాన్యం వదులుకునే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

పంత్ సూపర్ కెప్టెన్సీతో..
ఇక ట్రేడింగ్ ద్వారా పంజాబ్ కింగ్స్ నుంచి అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.7.6 కోట్లకు తీసుకుంది. రెండు దశలో జరిగిన ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్.. 7 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో అంచె నుంచి అందుబాటులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ 175 పరుగులతో రాణించాడు. అయ్యర్ గాయపడటంతో ఫస్టాఫ్ సీజన్‌లో జట్టును పంత్ నడిపించాడు. సూపర్ కెప్టెన్సీతో జట్టును టాప్‌లో నిలపడంతో అయ్యర్ కమ్ బ్యాక్ చేసినా.. అతనే కెప్టెన్‌గా కొనసాగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications