For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ ఆటగాళ్లతో మమ్మల్ని లిఫ్ట్ కూడా ఎక్కనీయలేదు: అశ్విన్

Ravichandran Ashwin reveals Indian players were not allowed to share lift with Australian players
#Ashwin Ready To Shave Half Moustache If #Pujara Goes Over The Top Against Any England Spinner

న్యూఢిల్లీ: సిడ్నీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా అధికారులు దారుణంగా ప్రవర్తించారని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరోపించాడు. మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్లతో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు కూడా అక్కడి అధికారులు తమకు అనుమతి ఇవ్వలేదని విమర్శించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమైందన్నాడు.

'మేం సిడ్నీ చేరుకునేసరికి కఠినమైన నిబంధనలను తీసుకొచ్చారు. ఆ టైమ్‌లో అనుకోని సంఘటనలు చాలా జరిగాయి. భారత్, ఆసీస్ టీమ్‌లు సేమ్ బయో బబుల్‌లోనే ఉన్నాయి. కానీ కంగారూ ప్లేయర్లు లిఫ్ట్‌లో ఉంటే అందులోకి వెళ్లేందుకు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. చాలా వింతగా అనిపించింది. చాలా విషయాల్లో మమ్ముల్ని చిన్న చూపు చూశారు. ఈ సంఘటనను చూసి చాలా బాధపడ్డాం. ఎందుకంటే రెండు టీమ్‌లు కలిసే బబుల్‌లో ఉన్నప్పుడు లిఫ్ట్‌లో పక్కన నిల్చుంటే ఏమౌతుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా మారింది'అని అశ్విన్ పేర్కొన్నాడు.

ఆసీస్ పర్యటనలో టాప్‌ బ్యాట్స్‌మన్‌ స్మిత్‌ను అవుట్‌ చేసే విషయంలో తన ఆలోచనల గురించి చెప్పిన అశ్విన్‌... పనిలో పనిగా ఇతర స్పిన్నర్లతో తనను పోల్చడంపై ఘాటుగా స్పందించాడు. 'ఒక మ్యాచ్‌కు ముందు నేను సొంతంగా హోమ్‌ వర్క్‌ చేసుకుంటాను. ఎనిమిది గంటల పాటు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ వీడియోలు చూస్తాను. ఆపై మ్యాచ్‌లో ఎక్కడ, ఎలాంటి ఫీల్డింగ్‌ ఉండాలో నిర్ణయించుకుంటా. టిమ్‌ పైన్‌ను మెల్‌బోర్న్‌లో అలాగే అవుట్‌ చేశా. స్మిత్‌ను ఎవరు ఔట్‌ చేస్తారనే దానిపై బాగా చర్చ జరిగింది. ఎవరూ నా గురించి మాట్లాడనే లేదు. ఆసీస్‌ గడ్డపై స్మిత్‌ ఎప్పుడూ స్పిన్నర్ల బౌలింగ్‌లో ఔట్‌ కాలేదు. నేను దానిని మార్చాలనుకున్నా. ప్రపంచంలో నన్ను నేను అత్యుత్తమ బౌలర్‌గా భావించుకుంటా. అలాగే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయాలని కోరుకుంటా. కోహ్లీతో తలపడలేను కాబట్టి స్మిత్‌తో తలపడ్డా. ఇప్పుడు ఈ సిరీస్‌ తర్వాత అందరూ నా గురించి మాట్లాడుకునేలా చేశా' అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.

లయన్, అలీలతో పోలుస్తూ తనను మరీ 'మైక్రోస్కోప్‌' కింద ఉంచి పరీక్షించారని అశ్విన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఆస్ట్రేలియా సిరీస్‌లో అశ్విన్‌కంటే లయన్‌ ప్రదర్శన బాగుండగా... 2018 సౌతాంప్టన్‌ టెస్టులో అలీ వికెట్లు తీసిన చోట అశ్విన్‌ విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. 'లయన్‌గానీ అలీగానీ సరిగ్గా ఆఫ్‌ స్టంప్‌ బయట బంతులు వేస్తున్నప్పుడు కామెంటరీ బాక్స్‌ నుంచి వార్న్‌ వాటిని అద్భుతంగా వర్ణించినంత మాత్రాన నేను అలాగే బౌలింగ్‌ చేయాలని ఏమీ లేదు.

గత సిరీస్‌లో అడిలైడ్‌లో నా పొత్తికడుపులో గాయమైనా సరే పట్టుదలగా ఆడి ఆరు వికెట్లు తీశాను. కానీ మ్యాచ్‌ ముగిశాక నాకంటే లయన్‌ ఎంత బాగా బౌలింగ్‌ చేశాడో అందరూ చెప్పుకున్నారు. ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం నన్ను చాలా బాధించింది. లయన్‌ మంచి బౌలరే. అతనంటే నాకు గౌరవం ఉంది. కానీ నా ఆలోచనలు వేరు. ఇకపై లయన్‌తో పోటీ పడటంకంటే స్మిత్‌తో తలపడటం ముఖ్యమని అర్థం చేసుకున్నా'అని అశ్విన్‌ వివరించాడు.

Story first published: Tuesday, January 26, 2021, 14:38 [IST]
Other articles published on Jan 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+