ఆ ఆర్టికల్ నా జీవితాన్ని మార్చేసింది.. అతనికి నేను డై హార్డ్ ఫ్యాన్: రవిచంద్రన్ అశ్విన్
టీమిండియా వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తనను విమర్శిస్తూ రాసిన ఆర్టికల్ తన జీవితాన్ని మార్చేసిందని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. తన తొలి ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన వెంటనే ఈ ఆర్టికల్ రాసాడని, అది తనకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని అశ్విన్ గుర్తు చేసుకున్నాడు.
2012లో ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అశ్విన్ ప్రదర్శన గురించి సంజయ్ మంజ్రేకర్ ఒక ఆర్టికల్ రాసాడు. అశ్విన్ బౌలింగ్‌ను కొనియాడుతూనే అతని ఫిజికల్ ఫిట్‌నెస్‌పై విమర్శలు గుప్పించాడు. అతని పేలవ ఫిట్‌నెస్ భవిష్యత్తులో బౌలింగ్, ఫీల్డింగ్‌పై ప్రభావం చూపుతుందని హెచ్చరించాడు.
ఆ ఆర్టికల్ నా జీవితాన్ని మార్చేసింది..
తాజాగా జియోస్టార్ చీకీ సింగిల్స్ షోలో పాల్గొన్న అశ్విన్.. ఈ ఆర్టికల్‌ను గుర్తు చేసుకొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో కోపం తెప్పించినా.. ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ పెట్టడానికి ఆ ఆర్టికల్ ఉపయోగపడిందని అభిప్రాయపడ్డాడు. 2015లో తనను కొనియాడుతూ మంజ్రేకర్ మరో ఆర్టికల్ రాసాడని, తాను స్వయంగా కాల్ చేసి ధన్యవాదాలు చెప్పానని గుర్తు చేసుకున్నాడు.

'నా తొలి ఆస్ట్రేలియా పర్యటన తర్వాత సంజయ్ మంజ్రేకర్ నా ప్రదర్శన గురించి ఒక ఆర్టికల్ రాసాడు. నేను తిరిగి వచ్చేటప్పుడు దాన్ని పూర్తిగా చదివాను. అది చదివాక నాకు తీవ్ర కోపం వచ్చింది. కోపం కంటే చాలా బాధగా అనిపించింది. నేను దాన్ని వదిలేశాను. అతనితో ఎక్కువగా మాట్లాడేవాడిని కూడా కాదు. నేను అంత గొప్ప అథ్లెట్‌ను కానందున.. ఆ తర్వాతి నాలుగేళ్లు చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత 2015లో.. అతను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నానని పేర్కొంటూ మరో ఆర్టికల్ రాసాడు. అప్పుడు నేను అతని నంబర్ అడిగి మరి ' మీ ఆర్టికల్ నా జీవితాన్ని మార్చేసింది' అని మెసేజ్ చేశాను.
నేను ఆడే సమయంలో నాపై విమర్శలు గుప్పించిన బ్రాడ్‌కాస్టర్లను తిట్టాను. జీవితంలో మీరేం సాధించారని నన్ను అంటున్నారని అన్నాను. కానీ రిటైర్మెంట్ తర్వాత.. నేను శత్రువులుగా భావించిన వాళ్లంతా నా గురించి చెడుగా మాట్లాడారని నాకు అనిపించలేదు. వాళ్లు తమ పని తాము చేస్తున్నారంతే అనిపించింది.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
హర్భజన్‌కు నేను డై హార్డ్ ఫ్యాన్
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు తను డైహార్డ్ అభిమానినని, కెరీర్ ప్రారంభంలో అతని బౌలింగ్‌ను అనుకరించేవాడినని అశ్విన్ తెలిపాడు. 'దినేష్ కార్తీక్ కెప్టెన్సీలో నేను తొలిసారి అండర్ 19 క్రికెట్ ఆడాను. ఆ సమయంలో నేను హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించడానికి ప్రయత్నించాను. ఆ రోజుల్లో నేను బ్యాటింగ్ చేసేవాడిని. దాంతో నాకు ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశాలు వచ్చేవి కావు.
బౌలింగ్ చేసినప్పుడు హర్భజన్ సింగ్ యాక్షన్‌ను అనుకరించేవాడిని. చాలా మంది అతని అభిమానులమనిచెబుతారు. కానీ నేను అతనికి డైహార్డ్ ఫ్యాన్‌ని. ఎందుకంటే అతను తీసిన తొలి అంతర్జాతీయ వికెట్ నాకు తెలుసు. గల్లీ క్రికెట్‌లో నేను ప్రతిరోజు అతని యాక్షన్‌ను అనుకరించేవాడిని. నేను అతని మ్యాచ్‌లన్నీ చూసేవాడిని.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

