India vs England: అశ్విన్ భాయ్.. నేను చివరి వరకు క్రీజులోనే ఉంటా! నువ్ సెంచరీ చేయ్!

చెన్నై: చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 482 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (5/60), రవిచంద్రన్ అశ్విన్ (3/53) దెబ్బకు ఇంగ్లండ్ 54.2 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కోహ్లీసేన 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో అదరగొట్టిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీ (149 బంతుల్లో 106; 14 ఫోర్లు, ఒక సిక్సర్) బాది.. భారత్ విజయంలో కీలక పాత్రపోషించాడు. అయితే అశ్విన్ శతకం సాధించినప్పుడు పేసర్ మహ్మద్ సిరాజ్ చేసిన సంబరాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

నువ్ సెంచరీ చేయ్ భాయ్
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 237 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోవడంతో.. అప్పటికి 77 పరుగులే చేసిన రవి అశ్విన్ సెంచరీ సాధిస్తాడా లేదా అని అందరిలో ఉత్కంఠ పెరిగింది. అయితే ఆ సమయంలో మొహ్మద్ సిరాజ్ ఆఖరి వరకు నిలబడతానని తనకి భరోసా ఇచ్చాడని అశ్విన్ తెలిపాడు. 'సిరాజ్‌కు అభిమానులు ఎంతో మద్దతు ఇచ్చారు. నేను 90 పరుగులకు చేరిన తర్వాత.. అతడు డిఫెన్స్ చేస్తున్న ప్రతిసారి కేరింతలతో ఉత్సాహపరిచారు. అప్పుడు సిరాజ్ నా దగ్గరికి వచ్చి.. "నా డిఫెన్స్‌కు మా నాన్న కూడా ఇలా చప్పట్లు కొట్టలేదు. ఇప్పుడు నన్ను ఎంతో మంది ఉత్సాహపరుస్తున్నారు. నువ్వు తప్పక శతకం సాధిస్తావ్. ఆఖరి వరకు నేను నిలబడతా"నని చెప్పాడు' అని యాష్ చెప్పాడు.

వాలిమై సినిమా అప్‌డేట్ ఏంటని అడిగారు
'తమిళ ప్రజలకి సినిమాలంటే అంతలా ఇష్టమని నాకు తెలియదు. బౌండరీ లైన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అశ్విన్.. అశ్విన్ అని పిలిచారు. వెనక్కి తిరిగితే.. 'వాలిమై' సినిమా అప్‌డేట్ ఏంటి అని ఓ అభిమాని అడిగాడు. అప్పుడు ఏం చెప్పలేదు. ఆ తర్వాత రోజు గూగుల్‌లో దాని గురించి తెలుసుకున్నా. అయితే మొయిన్ అలీ కూడా నా దగ్గరకు వచ్చి వాలిమై అంటే ఏంటని అడిగాడు. అప్పుడు నాకు అర్థమైంది. అలీని కూడా వాళ్లు అడిగారని. ఆ సినిమా గురించి ఇంగ్లండ్ ఆటగాడిని అడగటమే చాలా ఫన్నీగా అనిపించింది' అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

బిగ్గరగా అరుస్తూ సంబరాలు
మూడో రోజు మ్యాచ్ అనంతరం రవిచంద్రన్ అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ... 'గతంలో టెస్టుల్లో సెంచరీలు చేసినప్పుడు ఇషాంత్ శర్మ మరో ఎండ్‌లో ఉండేవాడు. ఇప్పుడు మాత్రం మొహ్మద్ సిరాజ్ ఉన్నాడు. అతడు క్రీజులోకి రాగానే ఒకటే చెప్పా. బంతి లైన్‌ను గమనిస్తూ.. బ్యాటింగ్ చేయమని సూచించా. బాగా ఆడాడు. నేను సెంచరీ సాధించినప్పుడు సంతోషంతో సిరాజ్ చేసుకున్న సంబరాలు చూశాక ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న అనుబంధాన్ని ఇది తెలియజేస్తుంది' అని చెప్పాడు. 99 పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్‌లో అశ్విన్ బౌండరీ బాది మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఆ క్షణంలో సిరాజ్ సంతోషంతో బిగ్గరగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు.
ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే.. ఈసారి ఎవరు? మ్యాక్స్‌వెల్ or మలన్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications