న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే.. ఈసారి ఎవరు? మ్యాక్స్‌వెల్‌ or మలన్!

IPL 2021 Player Auction: Most expensive players of last 13 IPL auctions list

చెన్నై:‌ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2021‌ మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో 292 మంది ఆటగాళ్లలో అదృష్టం ఎవరిని వరించనుందో తేలనుంది. చెన్నై వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి మినీ వేలం ప్రారంభం కానుంది. 164 మంది టీమిండియా క్రికెటర్లు, 125 మంది విదేశీ ప్లేయర్లు, ముగ్గురు అసోసియేట్‌ ఆటగాళ్లలో కేవలం 61 మందిని మాత్రమే ఫ్రాంఛైజీలు ఎంచుకోనున్నాయి. దీంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

IPL 2021 Auction: ఐపీఎల్‌ ఆడొద్దని ఆటగాళ్లకు చెప్పడం చాలా కష్టం.. మాకూ మేలు చేసేదే: ఇంగ్లండ్ కోచ్‌IPL 2021 Auction: ఐపీఎల్‌ ఆడొద్దని ఆటగాళ్లకు చెప్పడం చాలా కష్టం.. మాకూ మేలు చేసేదే: ఇంగ్లండ్ కోచ్‌

మ్యాక్స్‌వెల్‌ or మలన్:

మ్యాక్స్‌వెల్‌ or మలన్:

ఐపీఎల్ 2021లో వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరా అన్న అంశం ఉత్కంఠగా మారింది. అయితే ఐపీఎల్ 2021 వేలంలో ఎక్కువగా ఆకర్షిస్తోంది ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలనే. బిగ్‌బాష్‌ లీగ్‌ గత సీజన్‌లో పరుగుల వరద పారించడమే అందుకు కారణం. ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్‌వన్‌ టీ20 ఆటగాడైన మలన్.. ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. గతేడాది ఐపీఎల్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయిన ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై ఫ్రాంఛైజీలు కన్ను వేశాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతన్ని చేజిక్కించుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇరు ఫ్రాంచైజీలు పోటీపడితే మాత్రం అతనిపై కోట్లు కురిసే అవకాశముంది. ఈ ఇద్దరిలో ఒకరికి అత్యధిక ధర పలికే అవకాశం ఉంది.

స్మిత్‌, హేల్స్‌ కోసం కూడా

స్మిత్‌, హేల్స్‌ కోసం కూడా

ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్‌ హేల్స్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశముంది. ఆసీస్‌ పేసర్‌ జే రిచర్డ్‌సన్‌, బ్యాట్‌ బంతితోనూ రాణించే కివీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ కైల్ జేమీసన్‌, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీల మధ్య పోటీ ఉండొచ్చు. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌, బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌లతో పాటు ముస్తాఫిజుర్ రహ్మాన్‌, క్రిస్ మోరిస్‌, జేసన్‌ రాయ్‌, మార్నస్ లబుషేన్‌ కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నారు. అయితే గత సీజన్లలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడి వివరాలు ఓ సారి పరిశీలిద్దాం.

టాప్‌లో ప్యాట్‌ కమిన్స్‌:

టాప్‌లో ప్యాట్‌ కమిన్స్‌:

సీజన్‌ ప్లేయర్‌ జట్టు ధర
2020 ప్యాట్‌ కమిన్స్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ .15.5 కోట్లు
2019 జయదేవ్ ఉనద్కత్ రాజస్తాన్‌ రాయల్స్‌ రూ.8.4 కోట్లు
వరుణ్ చక్రవర్తి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ రూ.8.4 కోట్లు
2018 బెన్‌స్టోక్స్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 12.5 కోట్లు
2017 బెన్‌స్టోక్స్‌ రైజింగ్‌ పుణె సూపర్‌జాయింట్స్‌ రూ. 14.5 కోట్లు
2016 షేన్‌ వాట్సన్‌ ఆర్సీబీ రూ. 9.5 కోట్లు
2015 యువరాజ్‌ సింగ్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ రూ. 16 కోట్లు
2015 యువరాజ్‌ సింగ్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రూ. 14 కోట్లు
2013 గ్లెన్‌​ మాక్స్‌వెల్‌ ముంబై ఇండియన్స్‌ 1 మిలియన్‌ డాలర్లు
2012 రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2 మిలియన్‌ డాలర్లు
2011 గౌతం గంభీర్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కేకేఆర్‌ 2.4 మిలియన్‌ డాలర్లు
2010 కీరన్‌ పొలార్డ్ ముంబై ఇండియన్స్‌ 0.75 మిలియన్‌ డాలర్లు
షేన్‌ బాండ్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 0.75 మిలియన్‌ డాలర్లు
2009 ఆండ్రూ ఫ్లింటాఫ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ 1.55 మిలియన్‌ డాలర్లు
కెవిన్‌ పీటర్సన్‌ ఆర్సీబీ 1.55 మిలియన్‌ డాలర్లు
2008 ఎంఎస్‌ ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ 1.5 మిలియన్‌ డాలర్లు
Story first published: Thursday, February 18, 2021, 10:56 [IST]
Other articles published on Feb 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X