For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేయలేదు: అశ్విన్

చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియాకు ఎదురైన ఘోర పరాజయంపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. అసాధారణ ప్రదర్శనతో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచిందని కొనియాడాడు. గత ఆదివారం ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

ఇక ఈ టోర్నీలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన అశ్విన్.. తర్వాత 10 మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా ప్రపంచకప్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నాడు. మెగా టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా అనుసరించిన వ్యూహాలను వివరించాడు.

Ravichandran Ashwin Reveals Australias Strategic Masterclass In World Cup Final vs India

'వన్డే ప్రపంచకప్ 2023లో నేను ఒక మ్యాచ్‌కే పరిమితం అవుతానని ఊహించలేదు. నేను మంచి రిథమ్‌తో బౌలింగ్ చేసినా.. జట్టుకు అవసరపడలేదు. దాంతో తుది జట్టులో నాకు చోటు దక్కలేదు. ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా అమలు చేసిన వ్యూహాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాను నడిపించిన తీరు అద్భుతం. కోహ్లీ, అయ్యర్‌లను వ్యూహాత్మకంగా బౌలింగ్ చేసి ఔట్ చేశాడు. టోర్నీ ఆరంభంలో విఫలమైన కమిన్స్.. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు.

కమిన్స్ మాస్టర్ క్లాస్ వ్యూహాలకు నిదర్శనం. నలుగురు నుంచి ఐదు మంది ఫీల్డర్లను మోహరించి.. అతను ఆఫ్ స్పిన్నర్‌లా బౌలింగ్ చేసిన విధానం అద్భుతం. ముఖ్యంగా స్టంప్ లైన్ హిట్ చేస్తూ ఆఫ్ కట్టర్లు వేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. స్టంప్ లైన్ దిశగా 6 మీటర్లలోపే అతను బౌలింగ్ చేసాడు.

బ్యాటర్లకు డ్రైవ్ షాట్లు ఆడే అవకాశం ఇవ్వలేదు. ప్రతీ ఓవర్‌లో మూడు బాల్స్ అలాగే వేశాడు. ఇదే సమయంలో కమిన్స్ బౌలింగ్ చేస్తున్నంత సేపు మిడాఫ్‌లో ఫీల్డర్ కూడా పెట్టుకోలేదు. నిజంగా అతని బౌలింగ్ ఓ మాస్టర్ క్లాస్. ఆస్ట్రేలియా వ్యూహాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఇన్నింగ్స్ మధ్యలో నేను ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ దగ్గరకు వెళ్లాను.

ఎప్పుడూ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లుగా ఈసారి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించాను. దానికి అతను.. మేము ఇక్కడ చాలా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాం. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడాం. ఎర్రమట్టి పిచ్ అయితే పగుళ్లు వస్తుంది. కానీ నల్లమట్టి పిచ్ అలా కాదు. అలాగే రాత్రివేళ మరింత మంచిగా ఉంటుంది.

ఎర్రమట్టి పిచ్ మీద మంచు ప్రభావం ఉండదు. అయితే నల్లమట్టి మీద మధ్యాహ్మం బంతి స్పిన్ తిరుగుతుంది. కానీ రాత్రి సమయానికి అది కాంక్రీట్ మాదిరిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోతుంది. ఇదే మా అనుభవం అని చెప్పాడు'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, November 23, 2023, 18:37 [IST]
Other articles published on Nov 23, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+