ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఇవే.. ఆ జట్టును ఆపడం కష్టం: అశ్విన్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరే జట్లను టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంచనా వేసాడు. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో ముందంజ వేయడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. కేకేఆర్ కూడా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదని చెప్పిన అశ్విన్.. ఒకవేళ ఆ జట్టు టాప్-4లో నిలిస్తే ప్రమాదకరంగా మారుతుందని తెలిపాడు.
టాప్-2 టీమ్స్ ఏంటంటే..?
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఆర్‌సీబీ టాప్-2లో నిలిచే అవకాశం ఉందని చెప్పాడు. 'కేకేఆర్ చేతిలో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ చేరుకునేలా కనిపించడం లేదు. కేకేఆర్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించవచ్చు. ఒకవేళ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తే ఆ జట్టును ఆపడం కష్టం. కానీ ఈ టోర్నీలో కేకేఆర్ పుంజుకున్న తీరు అద్భుతం. ఈ తరహా ప్రదర్శనతోనే కేకేఆర్ మూడు టైటిళ్లు అందుకుంది.

ఈ లీగ్ దశ ముగిసేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీ టాప్-2లో నిలుస్తాయని అనుకుంటున్నా. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌ల్లో ఏవైనా రెండు జట్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉంటాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు రావాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలవాలి. లక్నోతో జరగబోయే రెండు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే విజయం సాధిస్తే కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుతుంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
టాప్‌లో SRH
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇంకా 19 లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉండగా.. ఇప్పటికీ ఒక్క టీమ్ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోలేదు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవ్వనుండగా.. పంజాబ్, ఆర్‌సీబీ, రాజస్థాన్, గుజరాత్ టైటాన్స్ మరో రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. సీఎస్‌కే మరో మూడు గెలవాల్సి ఉండగా.. కేకేఆర్ 4 విజయాలు సాధించాలి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ దాదాపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications