Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గబ్బా రమ్మన్నాడు.. వెళ్లాక చేతులెత్తేశాడు.. ఆసీస్‌ కెప్టెన్‌పై అశ్విన్‌ సెటైర్లు

Ravichandran Ashwin jokes Tim Paine played perfect host by missing Rishabh Pant stumping chance

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌పై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి వ్యంగ్యస్త్రాలు సంధించాడు. టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘన విజయానికి ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌పైన్‌ కూడా ఓ కారణమని తెలిపాడు. గబ్బాకు రమ్మని సవాల్ విసిరిన పైన్.. తీరా అక్కడికి వెళ్లాక చెత్త కీపింగ్‌తో భారత్ విజయానికి పరోక్షంగా సాయం చేశాడన్నాడు. టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్.శ్రీధర్‌ తన యూట్యూ‌బ్ చానె‌ల్ వేదికగా ముచ్చటించిన అశ్విన్ మరోసారి టిమ్‌పైన్‌పై చలోక్తులు విసిరాడు.

చెత్త కీపింగ్‌తో..

చెత్త కీపింగ్‌తో..

'రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌(89 నాటౌట్)ను స్టంపింగ్‌ చేసే అవకాశాన్ని పైన్‌ వదిలేశాడు. దాంతో పైన్‌ను ఇష్టపడటం మొదలెట్టాను. మమ్మల్ని గబ్బాకు రమ్మని పిలిచాడు. తీరా వెళితే అక్కడ స్టంపింగ్‌ చేసే అవకాశాన్ని వదిలేశాడు. అలా అతనే మాకు సిరీస్‌ను కట్టబెట్టాడు. 2-1 తేడాతో మేం గెలుపొందడానికి కృషి చేశాడని చెప్పను కానీ, పరోక్షంగా సాయం మాత్రం చేశాడు' అని అశ్విన్‌ సరదాగా పేర్కొన్నాడు.

సినిమా డైలాగ్స్‌తో

సినిమా డైలాగ్స్‌తో

'ఆసీస్ సారథి టిమ్‌ పైన్‌.. సినిమాల్లో డైలాగ్స్‌ చెప్పినట్లుగా మూడో టెస్టులో గబ్బాకి రా.. చూసుకుందాం అని సవాలు విసిరాడు. అదే సమయంలో ఆఖరి టెస్టుకు నేను, బుమ్రా, జడేజా, విహారి దూరమయ్యాం. బౌలింగ్‌లో అనుభవజ్ఞులు ఎవరూ లేరు. ఆసీస్‌ బౌలర్లు టెస్టుల్లో వెయ్యి వికెట్లు పైగా తీస్తే.. మన బౌలర్లు 13 వికెట్లు తీశారు. అయినా జట్టుగా పోరాడి విజయం సాధించాం. ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్ కమిన్స్‌ బౌలింగ్‌లో శార్దూల్‌ సిక్సర్‌తో ఖాతా తెరవడం సూపర్‌. అంతేగాక లాంగ్‌ఆన్‌లో సిక్సర్‌తో అతడు 50 పరుగులు చేశాడు'' అని అశ్విన్‌ తెలిపాడు.

అద్బుత పోరాటం..

అద్బుత పోరాటం..

ఇక సిడ్నీ వేదికగా మూడో టెస్టులో అశ్విన్‌(39 నాటౌట్), హనుమ విహారి(23 నాటౌట్)తో కలిసి ఓటమి వైపు వెళ్తున్న మ్యాచ్‌ను డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. ఒకవైపు విపరీతమైన వెన్నునొప్పి బాధిస్తున్నా.. అశ్విన్‌ ఎంతో నిబద్ధతతో ఆడాడు. వీరిద్దరూ 259 బంతులు ఎదుర్కొని చివరి వరకూ క్రీజులో పాతుకుపోయారు. తాము ఔటైతే టెయిలెండర్ల వికెట్లు పడతాయనే ఉద్దేశంతో మ్యాచ్‌ను డ్రా దిశగా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే సిడ్నీ టెస్టును డ్రా చేయడంతో అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురిసింది.

అశ్విన్ X పైన్

అశ్విన్ X పైన్

ఆరోజే పైన్‌ స్లెడ్జింగ్‌ చేయడంతో అశ్విన్ దీటుగా బదులిచ్చాడు. 'గబ్బాకు రా చూసుకుందాం' అని పైన్‌ అంటే.. 'నువ్వు భారత్‌కు వస్తే అదే నీ ఆఖరి సిరీస్‌' అంటూ అశ్విన్‌ సైతం సవాల్‌ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్‌ తర్వాత బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తాను అలా చేయాల్సింది కాదన్నాడు. ఇక గబ్బాలో తమకు ఓటమేలేదన్న అహంకారంతో పైన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తీరా భారత యువ ఆటగాళ్లు ఆసీస్ గబ్బా కోటను బద్దలు కొట్టారు. విజయానంతరమే అశ్విన్.. పైన్‌, ఆసీస్ మాజీ క్రికెటర్లకు తనదైన శైలిలో చురకలంటించాడు.

Story first published: Sunday, January 24, 2021, 14:52 [IST]
Other articles published on Jan 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+