Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలీల డ్యాన్స్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ ఫిదా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్‌కు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిదా అయ్యాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్‌కు శ్రీలీల దుమ్మురేపింది. అదిరిపోయే స్టెప్పులతో అభిమానుల మనసులను దోచుకుంది.

తాజాగా ఈ సినిమా గురించి తన యూట్యూబ్ చానెల్‌లో ప్రస్తావించిన అశ్విన్.. ఈ సాంగ్‌ను చూడాలని అభిమానులను కోరాడు. ఓ అభిమానితో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. 'మహేశ్ బాబు మూవీ గుంటూరు కారం సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ భయంకరంగా ఉంది. ఇప్పటికీ ఆ సాంగ్ చూడకపోతే యూట్యూబ్‌లో గుంటూరు కారం శ్రీలీల డ్యాన్స్ అని టైప్ చేసి చూడండి.

Ravichandran Ashwin Heaps Praises On Guntur Karam actress Sreeleela

మహేశ్ బాబు, శ్రీలీల అదిరిపోయే పెర్ఫెమెన్స్ ఇచ్చారు. ఈ సాంగ్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకు మంచి ఊపు తీసుకొస్తుంది.'అని తెలిపాడు. ఈ వీడియోను మహేశ్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వైరల్‌గా మారింది.

ఐపీఎల్‌లో అశ్విన్.. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మంగళవారమే ఆ జట్టుతో కలిసాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అశ్విన్ రాజస్థాన్ రాయల్స్‌కు కీలకం కానున్నాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ విజయాన్ని అందుకోలేకపోయిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఓ తాగుబోతు, యూట్యూబ్ ఫేమస్ చెప్పిన కుర్చీ మడతపెట్టి మాటను
ఎస్‌ఎస్ థమన్ సాంగ్‌గా స్వరపరిచాడు. ఆరంభంలో ఈ సాంగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చినా.. మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. అశ్విన్ సైతం ఈ సాంగ్‌కు ఫిదా అయ్యాడు.

Story first published: Tuesday, March 19, 2024, 20:37 [IST]
Other articles published on Mar 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+