Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Nitish Kumar Reddy: తెలుగోడి బౌలింగ్‌కు అశ్విన్ ఫిదా!(వీడియో)

టీమిండియా అప్‌కమింగ్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌కు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిదా అయ్యాడు. దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా బీకి ప్రాతినిథ్యం వహిస్తున్న నితీష్ కుమార్ రెడ్డి.. బెంగళూరు వేదికగా ఇండియా ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు.

సరైన లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. 5 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను నితీష్ కుమార్ రెడ్డి ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్‌కు ఫిదా అయిన అశ్విన్.. నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే ఆల్‌రౌండర్ అంటూ కితాబిచ్చాడు.

Ravichandran Ashwin hails Telugu Player Nitish Kumar Reddy Bowling in Duleep Trophy 2024

నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అశ్విన్.. 'ఈ ఎన్‌కేఆర్ టెస్ట్ ఫార్మాట్‌కు సరిపోయే ఆల్‌రౌండర్‌గా కనిపిస్తున్నాడు'అని సూపర్ అనే ఎమోజీతో క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. నితీష్ కుమార్ రెడ్డికి అశ్విన్ ఎన్‌కేఆర్ అనే బిరుదు కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సంచలన ప్రదర్శన కనబర్చిన నితీష్ కుమార్ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో టీమిండియా పిలుపు కూడా అందుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా అతను చివరి నిమిషంలో జింబాబ్వే పర్యటన నుంచి తప్పుకున్నాడు.

టెస్ట్ ఫార్మాట్ ఆల్‌రౌండర్ కోసం ఎదురు చూస్తున్న టీమిండియా.. నితీష్ రెడ్డితో ఆ ముచ్చట తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అతన్ని దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసింది. బ్యాటింగ్‌లో డకౌట్ అయిన నితీష్ కుమార్ రెడ్డి.. బౌలింగ్‌లో మాత్రం సత్తా చాటుతున్నాడు. బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్‌ల సిరీస్‌కు నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా బీ.. ముషీర్ ఖాన్(373 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 181) భారీ శతకంతో తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగుల భారీ స్కోర్ చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ముషీర్ ఖాన్.. టెయిలెండర్ నవ్‌దీప్ సైనీ(144 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీ సాయంతో 8వ వికెట్‌కు 205 పరుగులు జోడించాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా ఏ నిలకడగా ఆడుతోంది. మయాంక్ అగర్వాల్(36), శుభ్‌మన్ గిల్(25) విఫలమైనా.. రియాన్ పరాగ్(23 బ్యాటింగ్), కేఎల్ రాహుల్(18 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు.

Story first published: Friday, September 6, 2024, 16:58 [IST]
Other articles published on Sep 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+