Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే రిటైర్మెంట్ ప్రకటించా: అశ్విన్

తనలోని సృజనాత్మకతకు భవిష్యత్తు లేదనిపించడంతోనే రిటైర్మెంట్ ప్రకటించానని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియాతో కలిసి ఆసీస్ పర్యటనకు వెళ్లిన అశ్విన్.. గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ అనంతరం ఆకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో అందరూ అవాక్కయ్యారు.

ఇంత త్వరగా.. సిరీస్ మధ్యలో అశ్విన్ ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడని తర్జన భర్జనలు పడ్డారు. ఏదో అసంతృప్తితోనే తప్పుకున్నాడని కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అశ్వినే స్వయంగా తన రిటైర్మెంట్ గల కారణాన్ని వెల్లడించాడు. ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Ravichandran Ashwin Ends Silence On Abruptly Retiring Mid-Series In Australia

'నేను ఏ విషయాన్నైనా పెద్దగా సాగతీయను. జీవితంలో ఏ రోజు కూడా అభద్రతా భావానికి గురి కాలేదు. ఈ రోజు నాకు దక్కింది. రేపు కూడా నా వద్దే ఉంటుందని ఏ మాత్రం నమ్మను. ఈ ఆలోచన విధానమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది.

నేను చాలా పెద్దగా ఆలోచిస్తాను. నా గురించి జనాలు సంబరాలు చేసుకుంటున్నారంటే అస్సలు నమ్మను. నా కంటే ఆటే గొప్పదని భావిస్తాను. నా రిటైర్మెంట్‌పై నేను చాలా సార్లు ఆలోచించాను. ఏ రోజైనా నిద్ర లేవగానే నాలోని సృజనాత్మకతకు భవిష్యత్తు లేదనుకుంటే అదే రోజు నేను ఆటను వదిలేస్తాను. హఠాత్తుగా ఎందుకో నాకు ఆ రోజు అలాగే అనిపించింది. అందుకే వదిలేశాను.

ఆట కోసం నా సర్వస్వం ఇచ్చాను. గత కొన్నేళ్లుగా విభిన్నమైన నైపుణ్యాలు, ప్రతిభతో చాలా క్రికెట్ ఆడాను. నా ఆట గురించి ఇతరులకు చెప్పగలగడం చాలా ప్రత్యేకమైంది. మనల్ని మనం అన్వేషించుకొంటేనే అది సాధ్యమవుతోంది. ఆట గురించి మాట్లాడే విస్తృతమైన పరిజ్ఞానాన్ని నాకు ఇచ్చింది. రిటైర్మెంట్ ప్రకటించినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే అది పూర్తిగా నా నిర్ణయం. క్రికెట్ నాకు చాలా ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇతర కెప్టెన్ల కన్నా ధోనీ సారథ్యం విభిన్నంగా ఉంటుందని చెప్పాడు.'ధోనీ ప్రాథమిక విషయాలను బాగా చేస్తాడు. కానీ, చాలా మంది కెప్టెన్లు వాటిని పెద్దగా పట్టించుకోరు. దాంతో మ్యాచ్ వారికి సమస్యగా మారిపోతుంది.

ధోనీ బౌలర్ చేతికి బంతిని ఇస్తూనే అవసరమైన ఫీల్డింగ్ పేటుకోమని చెబుతాడు. అందుకు తగ్గట్లు బంతులు వేయమంటాడు. కొన్నిసార్లు బ్యాటర్లు.. బౌలర్ల లూజ్ డెలివరీలను బౌండరీ బాదినా ఏమనడు. బౌలింగ్ నుంచి తప్పించడు. కానీ నా బౌలింగ్‌లో ఎవరైనా కట్ లేడ్ డ్రైవ్ షాట్ ఆడితే మాత్రం ధోనీ కోప్పడుతాడు. బౌలింగ్ కూడా ఇవ్వడు. ఇలాంటి ప్రాథమిక విషయాల్లో ధోనీ కఠినంగా ఉంటాడు కాబట్టే ధోనీ సక్సె స్ అయ్యాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, December 24, 2024, 14:40 [IST]
Other articles published on Dec 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+