For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ravichandran Ashwin సంచలన నిర్ణయం.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి!

Ravichandran Ashwin becomes first batter

ముంబై: రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుత ప్రదర్శన కనబర్చిన అశ్విన్ అనూహ్యంగా రిటైర్డ్ ఔటయ్యాడు. రిటైర్డ్ ఔట్ అంటే బ్యాట్స్‌మన్ తనంతట తాను ఔట్ ప్రకటించుకొని పెవిలియన్ చేరడం. ఐపీఎల్ చరిత్రలో ఇలా రిటైర్డ్ ఔటవ్వడం ఇదే తొలిసారి. రియాన్‌ పరాగ్‌కు బ్యాటింగ్ అవకాశం ఇవ్వడం కోసమే అశ్విన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని, టీ20 క్రికెట్‌లో ఇదో ట్రిక్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రిటైర్డ్‌ ఔట్‌ అయితే తిరిగి బ్యాటింగ్‌ చేసే అవకాశం మాత్రం ఉండదు. అదే రిటైర్డ్‌ హర్ట్‌(గాయపడినప్పు మైదానం వీడటం) అయితే సదరు బ్యాట్స్‌మన్‌ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా చివరి బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి రావడానికి మాత్రమే చాన్స్ ఉంటుంది. రిటైర్డ్‌ ఔట్‌ అయితే మాత్రం మళ్లీ బ్యాటింగ్‌ చేసే అవకాశం రాదు. ఈ రెండింటి మధ్య ఇదే ప్రధాన వ్యత్యాసం.

అయితే అశ్విన్‌ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేదు. ఎందుకంటే తాను రిటైర్‌ ఔట్‌ అయ్యే సమయానికి మంచి బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. 23 బంతుల్లో 2 సిక్స్‌లతో 28 పరుగులు చేశాడు. హెట్‌మైర్‌తో కలిసి 66 పరుగులు జోడించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసి అశ్విన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. అశ్విన్‌ చేసిన ఈ పనిని కొందరు వ్యతిరేకిస్తే.. మరికొందరు సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం అతనికి బ్యాటింగ్ చేయడం అసౌకర్యంగా అనిపించిందేమోనని, టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చిందేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

shimron hetmyer

ఇకొందరు మాత్రం క్రికెట్ బుక్‌లో ఉన్న రూల్స్ అన్నిటినీ అశ్విన్ వాడుతున్నాడని సెటైర్లు పేల్చాడు. గతంలో మన్కడింగ్ చేయడాన్ని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేశాడు. ఇక టీ20 క్రికెట్‌లో రిటైర్డ్‌ ఔట్‌ అయిన నాలుగో బ్యాటర్‌గా అశ్విన్‌ నిలిచాడు. ఇంతకముందు పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది, బూటాన్‌కు చెందిన ఎస్‌ తోగ్బే, కుమిల్లా వారియర్స్‌కు చెందిన సంజాముల్‌ ఇస్లామ్‌లు రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగారు.

Story first published: Sunday, April 10, 2022, 22:58 [IST]
Other articles published on Apr 10, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+