Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాప్ లేపిన అశ్విన్.. అగ్రస్థానంలో రహానే! స్ట్రయిక్‌ రేట్‌ మాత్రం దారుణం! డబ్ల్యూటీసీ రికార్డులు ఇవే!!

Ravichandran Ashwin becames highest wicket-taker WTC tournament, Here is records

హైదరాబాద్: తొలిసారి ఐసీసీ నిర్వహించిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) టైటిల్‌ గదను న్యూజిలాండ్‌ దక్కించుకుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో గెలుపు అంచుల వరకు వెళ్లి భంగపడిన ఇంగ్లండ్‌ గడ్డపైనే విలియమ్సన్‌ సేన టెస్టు క్రికెట్‌ జగజ్జేతగా నిలిచింది. రిజర్వ్‌ డే అయిన బుధవారం ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్‌ 8 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన భారత బౌలర్లు, బ్యాట్స్‌మన్‌లు తుది మెట్టుపై బోల్తాపడి మూల్యం చెల్లించుకున్నారు. డబ్ల్యూటీసీ తొలి ఎడిషన్‌లో ఓవరాల్‌గా ఆటగాళ్ల ఫర్‌ఫార్మెన్స్‌, రికార్డ్స్ ఓసారి చూద్దాం.

ఒక్క అర్థ సెంచరీ లేదు

ఒక్క అర్థ సెంచరీ లేదు

టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఒక్క టీమిండియన్‌ బ్యాట్స్‌మ్యాన్‌ అర్థ సెంచరీ చేయలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే చేసిన 49 పరుగులే హయ్యెస్ట్‌. చేటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి స్టార్ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. పేస్ పిచ్‌లపై తడబడే బలహీనతను మరోసారి బయటపెట్టారు. ఇక భారత ప్లేయర్స్‌ సగటు 18.55. మొత్తం పరుగులు 371 (ఎక్స్‌ట్రాలను మినహాయిస్తే). ఇక స్ట్రయిక్‌ రేట్‌ 37.22 గా ఉంది. ఈ రేట్‌పై క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు పెదవి విరుస్తున్నారు.

ఒకే ఒక్కడు

ఒకే ఒక్కడు

డబ్ల్యూటీసీ ఫస్ట్‌ ఎడిషన్‌ టాప్‌ 5లో ఇద్దరు ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌, ఇద్దరు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌. ఇక టీమిండియా బ్యాట్స్‌మ్యాన్‌ ఉన్నారు. ఆసీస్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషెన్ 13 మ్యాచ్‌ల్లో 1676 పరుగులతో టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్‌ (20 మ్యాచ్‌ల్లో 1660), ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్‌ (13 మ్యాచ్‌లు 1341 పరుగులు), ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్ (17 మ్యాచ్‌లు 1334పరుగులు), భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే (18 మ్యాచ్‌లు 1174 పరుగులు) టాప్‌ 5లో ఉన్నారు.

Euro 2020: క్రిస్టియానో రొనాల్డో మ‌రో ప్రపంచ రికార్డ్!!

రహానే టాప్‌

రహానే టాప్‌

భారత జట్టులో చూసుకుంటే 18 మ్యాచ్‌ల్లో 1174 పరుగులు సాధించి అజింక్య రహానే టాప్‌ పొజిషన్‌లో నిలిచాడు. స్వదేశీ గడ్డపై మాత్రమే కాదు, విదేశాల్లో రహానే పర్‌ఫార్మెన్స్‌ బాగుంది. విదేశీ గడ్డపై ఆడిన 9 మ్యాచ్‌ల్లో 694 పరుగులతో టాప్‌ పొజిషన్‌లో నిలిచాడు. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం.. రోహిత్‌ శర్మదే పైచేయిగా ఉంది. 12 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 2 అర్థసెంచరీలతో 1094 పరుగులు సాధించాడు. యావరేజ్‌ 60.77తో దరిదాపుల్లో ఏ టీమిండియా ప్లేయర్‌ కూడా లేకపోవడం విశేషం.

అశ్విన్‌1

అశ్విన్‌1

డబ్ల్యూటీసీ టోర్నీలో ఎక్కువ వికెట్లు తీసింది టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌. 14 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు సాధించాడు. ఫైనల్ మ్యాచ్ ద్వారా ఆసీస్ పేసర్ ప్యాట్‌ కమ్మిన్స్‌ను అధిగమించాడు. కమ్మిన్స్‌ 14 మ్యాచ్‌ల్లో 70 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లీష్ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ 17 మ్యాచ్‌ల్లో 69, కివీస్ బౌలర్ టిమ్‌ సౌతీ 11 మ్యాచ్‌ల్లో 56, ఆసీస్ స్పిన్నర్ నాథన్‌ లైయోన్‌ 14 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు తీసి వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Story first published: Thursday, June 24, 2021, 11:47 [IST]
Other articles published on Jun 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+