
బుడాపెస్ట్: యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీలో పోర్చుగల్ స్టార్, జువెంటస్ క్లబ్ (ఇటలీ) ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అదరగొడుతున్నాడు. ఇప్పటికే యూరో కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన రొనాల్డో.. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ వరల్డ్ రికార్డును సమం చేశాడు. బుధవారం ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో రెండు గోల్స్ చేయడంతో.. ఇరాన్‌కు చెందిన అలీ డేయీ పేరిట ఉన్న రికార్డు సమం అయింది. ప్రస్తుతం రొనాల్డో 109 గోల్స్‌తో అలీతో కలిసి అగ్రస్థానంలో ఉన్నాడు.
ప్రపంచ ఛాంపియన్స్ ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్ డ్రా కావడంతో పోర్చుగల్ (రౌండ్ 16) నాకౌట్‌లోకి ప్రవేశించింది. యూరో 2020 టోర్నీలో పోర్చుగల్ కనీసం మరో మ్యాచ్ ఆడుతుండటంతో.. క్రిస్టియానో రొనాల్డో కొత్త ప్రపంచ రికార్డు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే యూరో 2020లో రొనాల్డో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. మూడు మ్యాచ్‌లలో ఐదు గోల్స్ చేశాడు. ఓవరాల్‌గా యూరోలో అత్యధిక గోల్స్ రికార్డు కూడా అతని పేరిటే ఉంది. మొత్తం 14 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఫ్రాన్స్ స్ట్రైకర్ కరీం బెంజెమా రెండు గోల్స్ చేసి తన జట్టును ముందుకు నడిపించాడు. కానీ క్రిస్టియానో రొనాల్డో రెండు గోల్స్ చేసి జట్టును ఓటమి నుంచి కాపాడాడు. 31వ నిమిషంలో రొనాల్డో మొదటి గోల్ బాదాడు. 60వ స్థానంలో బెంజెమా గోల్ కొట్టి 2-1తో ఫ్రాన్స్‌ను ముందంజలో నిలిపాడు. రెండో భాగంలో రొనాల్డో మరో గోల్ బాది స్కోరును సమం చేశాడు. ఆపై మ్యాచ్ డ్రా అయింది.
యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌పలో ఇంగ్లండ్, క్రొయేషియా జట్లు ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించాయి. మంగళవారం రాత్రి జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1-0తో చెక్ రిపబ్లిక్‌పై గెలిచింది. రహీమ్ స్టెర్లింగ్ (12వ నిమిషం) ఏకైక గోల్‌తో జట్టును గెలిపించాడు. మరో గ్రూప్-డి మ్యాచ్‌లో క్రొయేషియా 3-1తో స్కాట్లాండ్‌పై నెగ్గింది.