Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైభవ్ సూర్యవంశీ‌తో డ్రింక్స్ మోయించండి.. గంభీర్‌కు అండగా అశ్విన్!

టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌కు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ‌కి తుది జట్టులో చోటివ్వకుండా బెంచ్‌పై కూర్చోబెట్టడాన్ని అశ్విన్ సమర్ధించాడు. వైభవ్ సూర్యవంశీతో డ్రింక్స్ మోయించడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశాడు.

రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన భారత్ 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ ఇదే కాగా... చిత్తుగా ఓడటం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌తో 8 టీ20లు, మూడు వన్డేలు ఆడిన ఐర్లాండ్ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేదు.

గంభీర్‌పై విమర్శలు..

ఈ ఘోర పరాజయం నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని కాదని సంజూ శాంసన్‌ను జట్టులో కొనసాగించగా.. అతను 5 పరుగులే చేసి వెనుదిరిగాడు. దాంతో ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను పక్కనపెట్టి గంభీర్ తప్పు చేశాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Ravichandran Ashwin Backs Gautam Gambhir Opposes Rushing Vaibhav Sooryavanshi Over Sanju Samson

ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులు సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అరంగేట్రానికి సిద్దంగా ఉన్న వైభవ్ సూర్యవంశీతో డ్రింక్స్ మోయించడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు.

అందులో తప్పు ఏం ఉంది..?

ఈ విమర్శలపై తాజాగా రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ.. గంభీర్ నిర్ణయాన్ని సమర్ధించాడు. 'సంజూ శాంసన్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ జోడీ ప్రస్తుతం జట్టుకు ఎంతో అవసరం. ప్రపంచకప్‌లోనూ సంజూ మంచి ప్రదర్శన చేశాడు. ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన అతన్ని పక్కనపెట్టి వైభవ్‌ను జట్టులోకి తీసుకుంటే టీమ్ కాంబినేషన్ దెబ్బతింటుంది.

వైభవ్ సూర్యవంశీ డ్రింక్స్ మోస్తే తప్పు ఏంటి? అతన్ని బెంచ్‌పై కూర్చోని మ్యాచ్ చూడటంలో ఎలాంటి తప్పు లేదు. వాటర్ బాయ్‌గా పనిచేయడం ద్వారా అతను ఆటను నిశితంగా గమనించే అవకాశం లభిస్తుంది. గొప్ప ఆటగాళ్లు రాత్రికి రాత్రే తయారవ్వరు. సహనంతో నిరీక్షించడం ఆటగాళ్లను మానసికంగా మరింత బలోపేతం చేస్తుంది.

సచిన్ కూడా ఎదురు చూశాడు..

గతంలో సచిన్ టెండూల్కర్‌కు కూడా కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. వైభవ్ ఒకసారి జట్టులోకి వచ్చి స్థిరపడితే.. ఆ తర్వాత అతన్ని ఎవరూ తొలగించలేరు. కానీ అంతకంటే ముందు అతను బెంచ్‌పై వేచి ఉండటం నేర్చుకోవాలి. ఈ రకమైన అనుభవాలు యువ ఆటగాళ్లకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతాయి.’అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, June 27, 2026, 15:07 [IST]
Other articles published on Jun 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+