నా ఫేవరేట్ హీరో మహేశ్ బాబు.. బెస్ట్ మూవీ మగధీర : అశ్విన్

చెన్నై: తన ఫేవరేట్ తెలుగు హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు అని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అశ్విన్.. తాజాగా తెలుగు క్రికెటర్ హనుమ విహారీతో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడిన ఈ తమిళనాడు ప్లేయర్.. తెలుగు సినిమాలపై తనకున్న ఆసక్తిని తెలియజేశాడు.

భీష్మ గురించి మాట్లాడుతూ...
తమ ఇంట్లో తెలుగు సినిమాలు చూడటానికి తెగ ఇష్టపడుతారని, తాను కూడా చాలా సినిమాలు చూశానన్నాడు. తెలుగు ఫేవరేట్ మూవీ ఏంటని విహారిని ప్రశ్నించగా.. అతను ఇటీవల ఓ మంచి సినిమా చూశానని, అది భీష్మ అని చెప్పాడు. ఫుల్ కామెడీ మూవీ అని పేర్కొన్నాడు. హీరో ఎవరు అని అశ్విన్ అడగగా నితిన్ అని విహారి చెప్పాడు. ఆ తర్వాత అశ్విన్ మాట్లాడుతూ.. మా ఇంట్లో అందరు అమెజాన్లో తెలుగు సినిమాలు చూస్తున్నారని, తాను తెలుగు సినిమాలకి పెద్ద అభిమానినని తెలిపాడు.

మగధీర ఆల్టైమ్ బెస్ట్ మూవీ..
ఫేవరేట్ తెలుగు మూవీ ఏంటని విహారీ ప్రశ్నించగా.. తన ఆల్టైమ్ ఫేవరేట్ తెలుగు మూవీ రాంచరణ్ ‘మగధీర'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ‘ఎవరు’ మూవీ చూశానన్నాడు. అయితే మీరు రాంచరణ్ అభిమాని ఉన్నట్లున్నారని విహారీ అనగా.. ఎవరు రాంచరణ్ది కాదని అశ్విన్ తెలపగా.. ఎవడు రాంచరణ్ది అని హనుమ తెలిపాడు. ఇక మహేశ్ బాబుకు సంబంధించిన ఒక సినిమా చాలా ఇష్టమని, పేరు గుర్తు లేదని, తమిళంలో గిల్లీగా రీమేక్ చేశారన్నాడు. దీనికి విహారీ పోకిరీ అని తెలపగా..పేరు గుర్తుకులేదన్నాడు. వాస్తవానికి మహేశ్ బాబు ’ఒక్కడు‘ సినిమాను గిల్లీగా రిమేక్ చేశారు. తమిళ్ తెలుసా అని విహారిని అడగ్గా.. అర్థం అవుతుందని కానీ మాట్లాడలేనన్నాడు.

మహేశ్బాబుకు బిగ్ ఫ్యాన్..
ఇక తెలుగు సినిమా బెస్ట్ ఏంటనీ, అంత క్రేజ్ ఉండటానికి కారణం ఏందని అశ్విన్ అడగ్గా.. టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దదని, ఇక్కడ డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారని తెలుగు క్రికెటర్ తెలిపాడు. మహేశ్ బాబు ఎంత పెద్ద హీరో అని ప్రశ్నించగా.. అతను సూపర్ స్టార్ అని, నీవు మహేశ్ ఫ్యాన్ ఉన్నట్టున్నావని విహారీ అన్నాడు. దీనికి అశ్విన్ తాను మహేశ్ బాబుకు బిగ్ ఫ్యాన్ అని తెలిపాడు. ఇటీవల అలవైకుంఠపురంలో సినిమా కూడా చూశానని తమిళనాడు క్రికెటర్ తెలిపాడు. అలాగే సరిలేరు నీకెవ్వరు కూడా చూశానన్నాడు. అది ఎలా పలకాలో చెప్పావా? అని కూడా అశ్విన్ అడిగాడు. సినిమా టైటిల్ అర్థాన్ని కూడా అడిగి తెలుసుకున్నాడు.

విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ..
విజయ్ దేవరకొండ గురించి ఏమనుకుంటున్నావ్? అతనికెంత రేటింగ్ ఇస్తావని అశ్విన్ అడ్డగా.. విజయ్ దేవరకొండ యూత్ ఫేవరేట్ హీరో అని విహారి తెలిపాడు. గీతా గోవిందం సినిమా చూశావా? అని అశ్విన్ అడగ్గా చూశానని, చాలా బాగుందని విహారీ తెలిపాడు. తాను కూడా చూశానని సూపర్ సినిమా అంటూ తమిళనాడు క్రికెటర్ కితాబిచ్చాడు. ఇక భీష్మ గురించి ఇద్దరు స్టార్ క్రికెటర్స్ మాట్లాడుకోవడం చూసి ఆ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల గర్వంగా ఫీలయ్యాడు. నేను క్రికెట్ అభిమానిని కావడం వలన అశ్విన్, హనుమ విహారిలు భీష్మ సినిమా గురించి మాట్లాడుకోవడం సంతోషంగా అనిపించిందని అన్నాడు. అలానే భీష్మని ఇష్టపడ్డందుకు హనుమ విహారికి, తెలుగు సినిమాలని ప్రేమిస్తున్నందుకు అశ్విన్కి కృతజ్ఞతలు తెలిపాడు. ఇదే సందర్బంలో వెంకీ ట్వీట్కి స్పందించిన హనుమ..సినిమా చాలా నచ్చింది. అలానే అశ్విన్తో మాట్లాడడం మంచిగా అనిపించింది. భీష్మ సినిమా చూడమని ఆయనకి కూడా చెప్పాను అని హనుమ విహారి తన ట్వీట్లో పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications