Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాహుల్ ద్రవిడ్ కోలుకోవాలి.. కోచ్‌గా ఆ బాధ ఏంటో నాకు తెలుసు: రవి శాస్త్రి

Ravi Shastri talks about rescheduled England Test, saysCOVID-19 is just flu

న్యూఢిల్లీ: కరోనా బారిన పడిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ త్వరగా కోలుకోవాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆకాంక్షించాడు. ద్రవిడ్ జట్టుతో అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని, అతను అండగా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల కొండంత బలం, ప్లేయర్లలో నిండుతుందన్నాడు. ఓ కోచ్‌గా జట్టుకు దూరంగా ఉండటం తనకు బాగా తెలుసన్నాడు. కరోనా వైరస్ ఇప్పుడు సాధారణ ఫ్లూ మాత్రమేనని, ఓ రెండు పారాసిటమాల్ ట్యాబెట్లు వేసుకుంటే సరిపోతుందన్నాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా గతేడాది తాను ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నానని తెలిపాడు.

గతేడాది నా పరిస్థి ఇదే..

గతేడాది నా పరిస్థి ఇదే..

'నాకు గత ఏడాది కరోనా వచ్చిన సమయంలో జట్టుకి అందుబాటులో ఉండలేకపోయాను. కరోనా నెగిటివ్‌గా తేలిన తర్వాత కూడా బయో బబుల్ నిబంధనల కారణంగా టీమ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ నేను 6 రోజుల తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌‌లోకి వెళ్లి ఉంటే... అప్పుడు ఆ మ్యాచ్ జరిగి ఉండేది. ఐదో టెస్టు మ్యాచ్‌ జరిగి, సిరీస్‌ను 3-1 తేడాతో సొంతం చేసుకునేవాళ్లం కూడా. ఎందుకంటే అప్పుడు రిథమ్ మా వైపే ఉంది. కానీ కోవిడ్ వల్ల అలా జరగలేదు.

సాధారణ ఫ్లూ మాత్రమే..

సాధారణ ఫ్లూ మాత్రమే..

ఇప్పుడు కోవిడ్ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఇప్పుడు అది ఓ సాధారణ ఫ్లూ మాత్రమే... ఓ రెండు పారాసెటమల్ ట్యాబ్లెట్లు వేసుకుంటే చాలు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సమయానికి భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టీమ్‌కు అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ద్రవిడ్ లాంటి హెడ్ కోచ్ అండగా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల కొండంత బలం, ప్లేయర్లలో నిండుతుంది.'అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

పుస్తకావిష్కరణతో..

పుస్తకావిష్కరణతో..

వాస్తవానికి 2021 ఇంగ్లండ్ టూర్ మధ్యలో రద్దు కావడానికి కారణం కూడా రవిశాస్త్రియే. నిబంధనలకు విరుద్ధంగా ఇంగ్లండ్‌లో జరిగిన తన పుస్తకావిష్కరణ సభకు విరాట్ కోహ్లీతో పాటు భారత బృందాన్ని మొత్తాన్ని రవిశాస్త్రి తీసుకెళ్లాడు. ఈ ప్రోగ్రామ్ ముగిసిన నాలుగు రోజులకే రవిశాస్త్రి కరోనా పాజిటివ్‌గా తేలగా ఆ తర్వాత అప్పటి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌తో పాటు ఫిజియో‌థెరపిస్ట్, అసిస్టెంట్ ఫిజియో... ఇలా భారత బృందంలో వరుస కేసులు వెలుగుచూశాయి. దాంతో భారత్ చివరి మ్యాచ్‌ను రద్దు చేసుకొని ఐపీఎల్ 2022 సీజన్ కోసం దుబాయ్‌కు వెళ్లింది. ఈ ఏడాది జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. దాంతో సిరీస్ 2-2తో సమమైంది.

Story first published: Wednesday, August 24, 2022, 16:36 [IST]
Other articles published on Aug 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+