Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓవర్ కాన్ఫిడెన్సే టీమిండియా కొంపముంచింది: రవి శాస్త్రి

Ravi Shastri slams Team India after losing Indore Test, Says this is what overconfidence

ఇండోర్: వరుస విజయాలతో వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్, అతి నమ్మకమే ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నాడు. అతి విశ్వాసం, నమ్మకం ఎక్కువైనప్పడు ఆటగాళ్ల కళ్లు నెత్తికెక్కుతాయని, దాంతో ప్రత్యర్థిని తేలికగా తీసుకుంటారని తెలిపాడు. భారత ఆటగాళ్లు కూడా వరుస విజయాలతో ఆసీస్‌ను తక్కువ అంచనా వేసి మూల్యం చెల్లించుకున్నారని చెప్పాడు. ఈ ఓటమితో భారత ఆటగాళ్ల విజయ గర్వం నేలకు దిగిందన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రవి శాస్త్రి.. మూడో టెస్ట్ అనంతరం టీమిండియా పరాజయంపై స్పందించాడు.

విజయ గర్వం తలకెక్కడంతో..

విజయ గర్వం తలకెక్కడంతో..

ఈ ఓటమిపై టీమిండియా రెండు అడుగులు వెనక్కు వేసి సమీక్ష చేసుకోవాలని సూచించాడు. 'ఆటగాళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్, అతి నమ్మకమే టీమిండియా ఓటమికి కారణం. విజయ గర్వం తలకెక్కినప్పుడు ప్రత్యర్థి జట్టును తేలికగా కనబడుతోంది. ఈ ఓటమి భారత ఆటగాళ్ల గర్వాన్ని నేలకు దించుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఆడిన తీరును చూసినప్పుడే ఈ విషయం అర్థమైంది. కఠిన పరిస్థితుల్లో నిర్లక్ష్యపు షాట్లతో పాటు ఆధిపత్యం చెలాయించాలనే బ్యాటర్ల ఆతృత చూసినప్పుడే ఆటగాళ్ల అతి విశ్వాసంతో ఆడారని అర్థమైంది. ఈ ఓటమితోనైనా కాస్త తగ్గి ఆట తీరును సమీక్షించుకోవాలి'అని రోహిత్ సేనకు రవి శాస్త్రి సూచించాడు.

 జట్టులో చోటు కోసం..

జట్టులో చోటు కోసం..

మరో కామెంటేటర్ మాథ్యూ హెడెన్ భారత బ్యాటర్లపై విమర్శలు గుప్పించాడు. బ్యాటర్ల ఆట తీరును చూస్తే జట్టులో తమ చోటును కాపాడుకోవడానికి ఆడినట్లు అనిపించిందన్నాడు. 'జట్టులో మార్పు చేస్తూ కేఎల్ రాహుల్‌పై వేటు వేయడంతో కొందరు బ్యాటర్లు అసౌకర్యానికి గురయ్యారు. వారి స్థానాలను కాపాడుకోవడానికి, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఆలోచనతో ఆడినట్లు కనిపించింది.'అని విమర్శించాడు.

భారత ఆటగాళ్లను ఆడుకున్న ఇండోర్ పిచ్..

భారత ఆటగాళ్లను ఆడుకున్న ఇండోర్ పిచ్..

ఇక ఇండోర్ పిచ్ భారత ఆటగాళ్ల మైండ్‌సెట్‌తో ఆడుకుందని దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు.'తమ ప్రతిభకు బ్యాటర్లు న్యాయం చేయలేదు. భారత పిచ్‌లను గమనిస్తే వికెట్‌ ఫలానా విధంగా స్పందిస్తుందన్న అంచనాతో షాట్లు ఆడటం ద్వారా మన బ్యాట్స్‌మెన్‌ ఔటవుతారు. నిజానికి టీమిండియా బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం లేదు. తొలి రెండు టెస్టుల్లో రోహిత్‌శర్మ ఆకట్టుకున్నాడు.

నాగ్‌పుర్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. పరుగులు చేయలేకపోతున్నప్పుడు బ్యాటింగ్‌లో కాస్తంత అస్థిరత కనిపిస్తుంది. భారత బ్యాటర్లు అవసరమైన మేరకు వికెట్లు ముందుకొచ్చి ఆడలేకపోయారు. తమపై ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాన్ని పిచ్‌కు ఇచ్చారు. దీంతో రెండు ఇన్నింగ్స్‌లలో భారత బ్యాటర్ల మెదళ్లతో పిచ్‌ ఆడుకుంది'' అని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, March 4, 2023, 13:20 [IST]
Other articles published on Mar 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+