Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుడ్డోడు.. వారి ప్యాంట్లు ఊడదీసేవాడు: రవి శాస్త్రి

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తప్పుబట్టాడు. ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాడిని పక్కనపెట్టడం ఏంటని విమర్శలు గుప్పించాడు. వీలైనంత త్వరగా అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లోనే వైభవ్ సూర్యవంశీని ఆడించాల్సిందని రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. అక్కడి చిన్న మైదానాల్లో వైభవ్ సూర్యవంశీ బౌలర్లను చితక్కొట్టేవాడని, వారి ప్యాంట్లను ఊడదీసేవాడని చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20లకు వైభవ్ సూర్యవంశీ వద్దు: మాజీ సెలెక్టర్

ఇంగ్లండ్‌తో తొలి రెండు టీ20లకు వైభవ్ సూర్యవంశీ వద్దు: మాజీ సెలెక్టర్

ఐపీఎల్‌‌లో సంచలన ప్రదర్శనతో టీమిండియా పిలుపును అందుకున్న వైభవ్ సూర్యవంశీ‌కి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నిరాశే ఎదురైంది. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ వైభవ్‌ను మేనేజ్‌మెంట్ పట్టించుకోలేదు. టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్‌కు అండగా నిలిచింది. కానీ అతను వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. కనీసం రెండో టీ20లోనైనా వైభవ్‌ను ఆడించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

Ravi Shastri Slams Team Management for Benching Vaibhav Sooryavanshi Says He Would Have Taken Their Pants Off

తాజాగా సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో మాట్లాడిన రవిశాస్త్రి.. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్‌మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పించాడు. 'వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లోనే ఆడించాల్సింది. అక్కడన్నీ మందకొడి పిచ్. ఆ బౌలింగ్‌ను వైభవ్ చితక్కొట్టేవాడు. కానీ అతనికి అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లండ్ పర్యటనలోనూ అతనికి అవకాశం వస్తుందని చెప్పలేను. కానీ తప్పకుండా అతనికి అవకాశం ఇచ్చి తుది జట్టులో ఆడించాలి.

ఐపీఎల్‌లో అతను ఎలా ఆడాడో చూశాం. ఏ ఫాస్ట్ బౌలర్‌నూ వదల్లేదు. కానీ, ఇప్పుడు అతన్ని బెంచ్‌కే పరిమితం చేశారు. టీమిండియా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అతను. ప్రస్తుతం వైభవ్‌పై ఎలాంటి బాధ్యతలు లేవు. 15 ఏళ్ల వయసులోనే భయం లేకుండా స్వేచ్ఛగా ఆడుతాడు. తొలి మూడు ఓవర్లలోనే బౌలర్లపై విరుచుకుపడుతాడు. ఇలాంటి ఆరంభం లభిస్తే మిడిలార్డర్ బ్యాటర్లకు పని తేలిక అవుతుంది. అందుకే అతనికి ఎలాగైనా జట్టులో చోటు కల్పించాలి.'అని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు రవిశాస్త్రి సూచించాడు.

వైభవ్ సూర్యవంశీ.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో: మాజీ క్రికెటర్ సలహా!

వైభవ్ సూర్యవంశీ.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో: మాజీ క్రికెటర్ సలహా!

ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లోనూ సంజూ శాంసన్ విఫలమయ్యాడు. దాంతో అతని స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఆడించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గౌతమ్ గంభీర్ సారథ్యంలోని టీమ్‌మేనేజ్‌మెంట్ అతనికి అండగా నిలుస్తోంది. ఇంగ్లండ్‌తో రెండో టీ20 శనివారం జరగనుంది.

Story first published: Thursday, July 2, 2026, 14:01 [IST]
Other articles published on Jul 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+