India vs England: రవిశాస్త్రి టీమిండియా ప్రయాణానికి 40 ఏళ్లు!

న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్, దిగ్గజ ఆటగాడు రవిశాస్త్రి భారత క్రికెట్‌లోకి అడుగుపెట్టి సరిగ్గా నేటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తన అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం నాటి ఫొటోను ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 1981 ఫిబ్రవరి 21న న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ వేదికగా తొలి అంతర్జాతీయ టెస్ట్ ఆడినట్లు తెలిపాడు. ఇన్నేళ్లు గడుస్తున్నా ఇంకా ఈ ఆటతో, టీమిండియాతో ప్రయాణించడం గొప్పగా ఉందని రవిశాస్త్రి సంతోషం వ్యక్తం చేశాడు.

సంతోషంగా ఉంది..
'నలబై ఏళ్ల క్రితం ఇదే రోజు.. వెల్లింగ్టన్ వేదికగా నా టెస్ట్ కెరీర్ ప్రారంభించా. ఇన్నేళ్లు గడిచినా జట్టుతోనే నా ప్రయాణం కొనసాగుతుండటం సంతోషంగా ఉంది'అని ట్వీట్ చేశాడు. మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్‌గా రవిశాస్త్రి 11 ఏళ్లు సేవలందించాడు. అందులో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. ఈ క్రమంలోనే సుదీర్ఘ ఫార్మాట్‌లో 3,830 పరుగులు, 151 వికెట్లు సాధించాడు. అలాగే వన్డే ఫార్మాట్‌లో 3,108 పరుగులు, 129 వికెట్లు పడగొట్టాడు.

6 బంతుల్లో 6 సిక్స్‌లు
అయితే, అతను తొలి అంతర్జాతీయ పర్యటనలోనే మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఆపై కపిల్ దేవ్ నేతృత్వంలోని 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఇక 1985-86 సీజన్‌లో ముంబై తరఫున బరోడా జట్టుతో ఆడిన ఓ రంజీ మ్యాచ్‌లో రవిశాస్త్రి చరిత్ర సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గ్యారీ సోబర్స్ సరసన నిలిచాడు. అదే మ్యాచ్‌లో శాస్త్రి( 123 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్స్‌లతో 200 నాటౌట్) తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ బాదిన ఫస్ట్‌క్లాస్ ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు.

కోచ్‌గా..
ఇక 1992లో ఆటకు వీడ్కోలు పలికిన రవిశాస్త్రి, తర్వాత కామెంటేటర్‌గా, భారత జట్టు మేనేజర్‌గా పలు విభాగాల్లో పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే 2017లో అనిల్‌కుంబ్లే కోచ్‌గా తప్పుకున్నాక రవిశాస్త్రి ఆ బాధ్యతల్లో చేరాడు. అతడి పర్యవేక్షణలోనే టీమిండియా వరుసగా రెండు పర్యటనల్లో ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ సిరీస్‌లు గెలుపొందడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications