న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, రహానే కెప్టెన్సీలో తేడా అదే: రవిశాస్త్రి

Ravi Shastri says Virat Kohli face captain, Ajinkya Rahane calm and composed one
Boxing Day Test : Virat Kohli Is Very Passionate, Ajinkya Rahane Is Calm - Ravi Shastri

మెల్‌బోర్న్‌: బాక్సింగ్‌డే టెస్టు విజయం అనంతరం టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానేను భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి పొగడ్తలతో ముంచెత్తాడు. రహానే బ్యాటింగే రెండో టెస్టులో టర్నింగ్‌ పాయింటని రవిశాస్త్రి కొనియాడాడు. ‌స్టాండిన్ కెప్టెన్ ర‌హానే (112), ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా (57) అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 326 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. దాంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 200కే పరిమితం చేయడంతో.. భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులను ఛేదించింది.

అదే టర్నింగ్‌ పాయింట్

అదే టర్నింగ్‌ పాయింట్

మ్యాచ్ అనంతరం హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి మాట్లాడుతూ... 'తొలి ఇన్నింగ్స్‌లో అజింక్య రహానే బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు టీమిండియా 60 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. విపత్కర పరిస్థితుల్లో 6 గంటల పాటు బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. అది ఆస్ట్రేలియా గడ్డపై అంటే మాటలు కాదు. అయినా రహానే బాగా ఆడి సెంచరీ చేశాడు. రహానే ఏకాగ్రత నమ్మశక్యం కానిది. ఈ మ్యాచ్‌లో అతడి బ్యాటింగే టర్నింగ్‌ పాయింట్‌. అతడు సెంచరీ చేయకుంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది' అని అన్నాడు. రహానే 223 బంతులతో 12 ఫోర్ల సాయంతో 112 రన్స్ చేశాడు.

జింక్స్ ప్రశాంతంగా ఉంటాడు

జింక్స్ ప్రశాంతంగా ఉంటాడు

విరాట్ కోహ్లీ, అజింక్య రహానే కెప్టెన్సీలపై హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి స్పదించాడు. కోహ్లీ, రహానే ఇద్దరూ ఆటను బాగా అర్థం చేసుకుంటారని, విరాట్‌ ఆటపట్ల దూకుడుగా ఉంటే.. జింక్స్ మాత్రం ప్రశాంతంగా ఉంటాడన్నాడు. అది వారి స్వభావమని చెప్పాడు. అయితే రహానే నిర్మలంగా ఉన్నా తనకేం కావాలో తెలుసని కోచ్ శాస్త్రి‌ పేర్కొన్నాడు. పితృత్వ సెలవులపై కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి భారత్ వచ్చాడు. విరాట్ సతీమణి అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరి ఆరంభంలో తొలి బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే విరాట్ ఇండియాకి వచ్చేశాడు.

క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుత విజయం

క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుత విజయం

కెప్టెన్ విరాట్ కోహ్లీ లేడు.. స్టార్ పేసర్ మహ్మద్ షమీ లేడు.. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ లేడు.. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ లేడు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా గాయంతో దూరమయ్యాడు. శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌ ఇద్దరూ అరంగేట్ర ఆటగాళ్లే. అయినా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై భారత్ ఓడించింది. అడిలైడ్ పరాజయం తర్వాత ఎవరూ ఊహించని రీతిలో విజయాన్నందుకుంది. నిజంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుత విజయం.

జట్టుతో కలవనున్న రోహిత్ శర్మ.. మూడో టెస్టుకి మాత్రం డౌటే!!

Story first published: Tuesday, December 29, 2020, 15:18 [IST]
Other articles published on Dec 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X