
మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టు?
2021, జనవరి 7 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. షెడ్యూల్ ప్రకారం సిడ్నీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరగాలి. అయితే గత కొన్నిరోజులుగా సిడ్నీలో పెద్దఎత్తున కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. రెండో టెస్టు జరుగుతున్న మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్టును కూడా నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భావిస్తోంది. అధికారిక ప్రకటన రాయపోయినా.. మెల్‌బోర్న్‌లోనే మూడో టెస్ట్ జరగనుంది. దాంతో మెల్‌బోర్న్‌కి రోహిత్ రాక తప్పడం లేదు.

ఫిట్‌నెస్ టెస్టులో పాసైతేనే
అయితే తుది జట్టులోకి ఎంపిక చేసే ముందు రోహిత్ శర్మకు మ్యాచ్ ఫిట్‌నెస్ టెస్టుని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్వహించబోతోంది. 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న రోహిత్.. ఈ ఫిట్‌నెస్ టెస్టులో పాసైతేనే తుది జట్టులోకి వస్తాడు. ఎలాంటి జిమ్, ప్రాక్టీస్ సౌకర్యం లేని అపార్ట్‌మెంట్‌లో క్వారంటైన్‌లో ఉన్న రోహిత్.. ఆ ఫిట్‌నెస్ టెస్టులో పాసవుతాడా? అని ఇప్పుడు అందరిలో అనుమానం నెలకొంది. కరోనా మహమ్మారి సమయంలో బాగా లావయిపోయిన రోహిత్.. ఫిట్‌నెస్ టెస్టులో ఏం చేస్తాడో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మయాంక్‌కు షాక్
అడిలైడ్ టెస్టులో యువ ఓపెనర్ పృథ్వీ షా (0, 4) ఘోరంగా విఫలమయిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్ టెస్టుకి అతని స్థానంలో శుభమన్ గిల్‌ని తుది జట్టులోకి తీసుకున్నారు. గిల్ అద్భుతంగా రాణించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పూర్తిగా తేలిపోయాడు. ఒకవేళ రోహిత్ శర్మ మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తే.. మయాంక్‌ను పక్కనపెట్టనున్నారు. రోహిత్‌తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 'రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడం పట్ల మేము సంతోషిస్తున్నాం. నిన్న అతనితో మాట్లాడా. జట్టుతో కలవడానికి ఆతృతగా ఉన్నాడు' అని కెప్టెన్ అజింక్య రహానే పేర్కొన్నాడు.

కోహ్లీ, రోహిత్ లేకున్నా
ఐపీఎల్ 2020 తర్వాత ఆస్ట్రేలియాతో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన భారత్ ఇటీవల అడిలైడ్ టెస్టులోనూ ఘోర పరాభవం పాలైంది. ఆ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆధిపత్యంలో నిలిచినా మూడో రోజు అనూహ్యంగా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 36/9 స్కోర్ సాధించి టెస్టు చరిత్రలో అవమానకరమైన రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలోనే రెండో టెస్టులో విజయం సాధించి ఆస్ట్రేలియాకు దీటుగా బదులివ్వడమే కాకుండా ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ మొహ్మద్ షమీ లేకున్నా.. భారత్ అద్భుతంగా ఆడింది.


Click it and Unblock the Notifications

అద్భుతంగా ఆడారు.. ఈ విక్టరీ క్రెడిట్ వాళ్లిద్దరిదే: రహానే










