Ravi Shastri:విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గా మరో రెండేళ్లు కొనసాగాల్సింది!

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మరో రెండేళ్లు కొనసాగాల్సిందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అతను ఇంత త్వరగా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ కమిషనర్‌గా ఉన్న రవిశాస్త్రి ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని విరాట్ తీసుకున్న నిర్ణయాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం గౌరవించాల్సిందేనని చెప్పాడు.

మరో రెండేళ్ల పాటు..
'టెస్ట్‌ల్లోనైనా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగాల్సింది. కనీసం మరో రెండేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించాల్సింది. ఎందుకంటే రాబోయే రెండేళ్లలో టీమిండియా స్వదేశం వేదికగా 9, 10 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ లెక్కన అతను కెప్టెన్‌గా కొనసాగితే తన కెప్టెన్సీలో 50-60 విజయాలు అందించేవాడు. కానీ ఇలా అనూహ్యంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. అయితే అతని నిర్ణయాన్ని మనం గౌరవించాలి. ఏ దేశం తరఫునైనా.. విరాట్ సాధించిన ఈ ఘనతలు అద్భుతం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై విజయాలు సాధించడం గొప్ప విషయం.

ఐదేళ్లు అగ్రస్థానంలో..
కోహ్లీ సారథ్యం వహించిన 5-6 ఏళ్లలో టీమిండియా ఐదేళ్ల పాటు అగ్రస్థానంలో ఉంది. ఇలాంటి ఘనత అతి కొద్ది మంది సారథులకే సాధ్యం. అలాంటి కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడంటే అది అతని వ్యక్తిగత నిర్ణయం. అతను తన కెప్టెన్సీని ఎంత ఆస్వాదించాడో అతనికి తెలుసు. ధోనీ, సచిన్ టెండూల్కర్ కూడా తమ కెప్టెన్సీని ఎంజాయ్ చేయలేకపోయారు.

బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టేందుకే..
ఆరేళ్ల పాటు కెప్టెన్‌గా ప్రతీ క్షణం ఆస్వాదించిన విరాట్.. ఇప్పుడు తన బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే ఒత్తిడి తగ్గించుకొని బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్క్‌ర్‌లు కెప్టెన్సీ వదిలేసి తమ ఆటపై ఫోకస్ పెట్టారు. విరాట్ కూడా అదే ఆలోచనతో ఈ పనిచేశాడు.'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్‌లో విరాట్ అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్. అతని సారథ్యంలో 60 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 40 విజయాలు అందుకుంది. అయితే సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం విరాట్ అనూహ్యంగా ఏడేళ్ల తన కెప్టెన్సీ ప్రస్థానాన్ని ముగిస్తూ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

ఐసీసీ టైటిళ్లు గెలవలేదనే..
ఐసీసీ టైటిళ్లు గెలవలేదనే ఒత్తిడిని అధిగమించలేకపోయిన కోహ్లీ టీ20 ప్రపంచకప్ ముంగిటే పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ ఘోర వైఫల్యం అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు అవసరం లేదని బీసీసీఐ.. కోహ్లీ వన్డే కెప్టెన్సీపై వేటు వేసింది. ఈ నిర్ణయం భారత క్రికెట్‌లో దుమారం రేపింది. బీసీసీఐXకోహ్లీగా మారింది. ఈ క్రమంలోనే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీని వదులుకోవడం అనేక సందేహాలను రేకెత్తించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications