Ravi Shastri: నేను, భరత్ అరుణ్ కోచ్‌గా ఉండొద్దని కొందరు ప్రయత్నించారు! మాజీ హెడ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్‌గా తాను రెండో సారి బాధ్యతలు చేపట్టకుండా కొందరు ప్రయత్నించారని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి తెలిపాడు. తనతో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ను కూడా జట్టు నుంచి సాగనంపేందుకు ప్రయత్నాలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించిన నేపథ్యంలో రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధానత్యను సంతరించుకున్నాయి. టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్ పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే.
ఇక శాస్త్రి స్థానంలో భారత జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్.. ఇప్పటికే స్వదేశంలో టీ20, టెస్టు సిరీస్‌ల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉండటం అనవసరం అని భావించిన సెలెక్టర్లు వన్డేలకు కూడా రోహిత్ శర్మనే కెప్టెన్‌గా నియమించారు. దీంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు అనుసరిస్తున్న పద్దతిలోనే రెడ్ బాల్ క్రికెట్‌కు కోహ్లీ, వైట్ బాల్ క్రికెట్‌కు రోహిత్‌లను వేర్వేరు కెప్టెన్లుగా నియమించారు. ఈ నిర్ణయం నేపథ్యంలో మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు.

మనకు నచ్చని వారుంటారు..
'నేను టీమిండియాకు రెండు టర్మ్స్ హెడ్ కోచ్‌గా ఉన్నాను. తొలి సారి సాఫీగానే సాగినా.. రెండో సారి నేను కోచ్‌గా ఉండటం కొంత మంది వ్యక్తులకు ఇష్టం లేదు. ముఖ్యంగా బీసీసీఐలోకి ఒక వ్యక్తికి నేనన్నా.. నా సపోర్టింగ్ స్టాఫ్‌లో భరత్ అరుణ్ అన్నా నచ్చేది కాదు. అందుకే నన్ను కోచ్‌గా తీసేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ నేను నా బాధ్యతలకు కట్టుబడి ఉండి మంచి ఫలితాలు సాధించాను. బౌలింగ్ కోచ్ కూడా మెరుగైన ఫలితాలు రాబట్టడంతో మమ్మల్ని తీసుకోక తప్పలేదు. జీవితం అంటే ఇలాగే ఉంటుంది. అందరూ మనకు అనుకూలమైన వ్యక్తులే ఉండరు'అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

ప్రతీదానికి స్పందించాల్సిన పనిలేదు..2
టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ అనవసర విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదని మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించాడు. జట్టుకు ఏది అవసరమో అదే చేస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నాడు. రోహిత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడంపై ఆనందం వ్యక్తం చేసిన రవిశాస్త్రి అతడికి పలు సూచనలు చేశాడు. 'రోహిత్ అనవసర విషయాలకు స్పందించాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బట్టి జట్టుకు ఏది అవసరమో అదే చేస్తూ ముందుకు సాగాలి. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని సమర్థంగా ఉపయోగించుకుంటేనే విజయవంతమైన నాయకుడిగా రాణించగలుగుతాడు' అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.

సూపర్ రిజల్ట్స్.. కానీ
రవిశాస్త్రి - విరాట్ కోహ్లీ హయాంలో భారత జట్టు మెరుగైన ఫలితాలు సాధించింది. కానీ మూడు ఫార్మాట్లలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. అదే ఈ ఇద్దరికి శాపంగా మారింది. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై రెండు సార్లు విజయం సాధించింది. ఇవే కాకుండా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాపై భారత జట్టు అజేయంగా నిలిచింది. అతని హయాంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్‌లలో టీ20 సిరీస్‌లను భారత్ గెలుచుకుంది. గత నాలుగేళ్లలో భారత్ బెంచ్ బలం కూడా చాలా రెట్లు పెరిగింది.

మూడు ఫార్మాట్లలో..
రవిశాస్త్రి హయాంలో టీమ్ ఇండియా మొత్తం 43 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 25 గెలిచి 13 ఓడింది. 5 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. వన్డేలలో 79 మ్యాచ్‌లు ఆడింది. అందులో 53 గెలిచి 23 ఓడింది. రెండు మ్యాచ్‌లు టై కాగా, ఒకటి అసంపూర్తిగా నిలిచింది. టీ20 గురించి చెప్పాలంటే 68 మ్యాచ్‌లు ఆడిన భారత్ 44 గెలిచి 20లో ఓడిపోయింది. 2 మ్యాచ్‌లు టై కాగా, రెండు అసంపూర్తిగా ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లీని కూడా రవిశాస్త్రి కొనియాడాడు.'కోహ్లీ సమర్థవంతమైన ఆటగాడే. కానీ, అతను సాధించిన రికార్డులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కెప్టెన్‌గా అతడు సాధించిన విజయాల ఆధారంగానే గౌరవిస్తుంటాం. టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం అనేది మామూలు విషయం కాదు. కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన విజయాల పట్ల గర్వపడాలి. వ్యూహాత్మకంగా అతడు గొప్ప కెప్టెన్' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications