సచిన్ 100 సెంచరీలు.. కోహ్లీ నుంచి కూడా కాదు: రవి శాస్త్రి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించడం, సమం చేయడం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి అంత సులువైన పనికాదని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) అన్నాడు. అయితే విరాట్ కోహ్లీ చాలా ఫిట్‌గా ఉన్నాడని, అతను మరో ఐదు నుంచి ఆరేళ్లు సునాయసంగా క్రికెట్ ఆడగలడని చెప్పాడు. 34 ఏళ్ల కోహ్లీ ఇప్పటి వరకు 108 టెస్ట్‌లు, 274 వన్డేలు, 115 టీ20ల్లో 75 సెంచరీలు నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో 28 సెంచరీలు బాదిన విరాట్.. వన్డేల్లో 46, టీ20ల్లో ఒక శతకాన్ని అందుకున్నాడు.
2019లో చివరిసారిగా సెంచరీ బాదిన విరాట్.. గతేడాది ఆసియాకప్‌లో శతకాన్ని నమోదు చేసి మూడేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ సెంచరీలతో తర్వాత వన్డేల్లో 2, టెస్ట్‌ల్లో ఒక సెంచరీ అందుకున్నాడు. దాంతో కోహ్లీ 100 సెంచరీల మార్క్ అందుకుంటాడని మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆశిస్తున్నారు.
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి శాస్త్రి ఈ అంశంపై మాట్లాడాడు. 100 సెంచరీలు చేయడం అంత సులువైన పనికాదని చెప్పాడు. 'అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసింది ఎందరంటే? ఒక్కరే ఒక్కరు. కాబట్టి విరాట్ కోహ్లీ ఈ ఘనతను అందుకుంటే గొప్ప విషయం అవుతుంది. ఇప్పటికీ అతనిలో చాలా క్రికెట్ మిగిలే ఉంది. అతను చాలా ఫిట్‌గా ఉన్నాడు. క్లాస్ ఆటగాళ్లు సెంచరీ చేయడం మొదలుపెడితే వరుసగా సాధిస్తారు. 15 మ్యాచ్‌లు ఆడితే అందులో ఏడు సెంచరీలు చేయగలరు. పూర్తి ఫిట్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఇంకా ఐదు నుంచి ఆరేళ్లు సునాయసంగా ఆడగలడు.
కానీ సచిన్ 100 సెంచరీల రికార్డును అధిగమించడం మాత్రం అంత సులువైన పని కాదు. మనం ఊహించినంత సులువుగా ఈ రికార్డును కోహ్లీ అందుకోలేడు. అతను సాధించినా.. సాధించకున్నా.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కడే సాధించిన ఈ ఘనతను కోహ్లీ చేరుకుంటాడని చెప్పడమే గొప్ప విషయం.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ ముందు మూడేళ్లు విరాట్ కోహ్లీ ఒక్క సెంచరీ సాధించలేకపోయాడు. ఐపీఎల్ కారణంగా బయో బబుల్‌లోనే ఆడటం, కెప్టెన్సీ ఒత్తిడి నేపథ్యంలో విరాట్ సెంచరీల చేయలేకపోయాడు. కానీ కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత స్వేచ్చగా ఆడుతున్న కోహ్లీ.. మళ్లీ శతకాల నమోదు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2023 సీజన్ కోసం సిద్దమవుతున్నాడు. శనివారమే ఆర్‌సీబీ టీమ్‌తో కోహ్లీ కలిసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications