Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యా ఫామ్‌లోకి వస్తే ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించగలడు: రవిశాస్త్రి

Ravi Shastri says Once in the groove, Hardik Pandya can string 4-5 match-winning scores

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. హార్దిక్ పాండ్యా విభిన్నమైన ఆటగాడని, ఫామ్‌లోకి వస్తే ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా అతనిలో ఉందని చెప్పాడు. ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో హార్దిక్ టచ్‌లోకి రావడం ముంబై ఇండియన్స్‌కు శుభపరిణామమని చెప్పాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హార్దిక్.. 30 బంతుల్లో 40 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు హార్దిక్ కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్‌లో దారుణంగా విఫలమైన హార్దిక్.. గాయంతో సెకండాఫ్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

హార్దిక్ టచ్‌లోకి రావడం..

హార్దిక్ టచ్‌లోకి రావడం..

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అదృష్టవశాత్తు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్న అతను టచ్‌లోకి వచ్చాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జరుగుతున్న మ్యాచ్ నేపథ్యంలో రవిశాస్త్రి హార్దిక్ పాండ్యా ప్రదర్శనపై స్పందించాడు. ముంబై, ఢిల్లీ పటిష్ట జట్లని, కానీ రోహిత్ సేనకే అడ్వాంటేజ్ ఉందని అభిప్రాయపడ్డాడు. 'హార్దిక్ పాండ్యా ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన ఆటగాడు. కొన్నిసార్లు 100 శాతం సిద్దంగా లేనప్పుడు అది మన మదిలో వెంటాడుతుంది. కాబట్టి హార్దిక్ జట్టులోకి రావడంతో పాటు ఫామ్ అందుకోవడం ముంబై ఇండియన్స్‌కు కలిసొచ్చే అంశం. చాలా రోజులుగా నాకు హార్దిక్ పాండ్యా తెలుసు. అతను గనుక ఫామ్‌లోకి వచ్చాడంటే సులువుగా 4-5 మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించగలడు.

ఆ ఇద్దరు కూడా చెలరేగితే..

ఆ ఇద్దరు కూడా చెలరేగితే..

'ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మంచి జట్లే. కానీ నేను మాత్రం ముంబై గెలుస్తుందనుకుంటున్నా. గత మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తడబడింది. ముంబై మాత్రం అద్భుత విజయంతో మూమెంటమ్ అందుకుంది. హార్దిక్ రాణించడంతో ఓడే మ్యాచ్‌లో విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కూడా టచ్‌‌లోకి వచ్చారంటే.. ముంబై జట్టుకు తిరుగుండదు. అందుకే ముంబైకి అవకాశాలున్నాయని చెబుతున్నా'అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

హోరాహోరీ మ్యాచ్‌లు..

హోరాహోరీ మ్యాచ్‌లు..

ఇక ఐపీఎల్ ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం జరిగే మ్యాచ్‌లు కొంచెం రసవత్తరంగా ఉండాలని రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. 'ఐపీఎల్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా జరగాలి. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోగా.. మూడు, నాలుగో స్థానం కోసం పోటీపడే జట్ల మధ్య రసవత్తరపోరు జరగాలి. ప్రతీ ఐపీఎల్ అభిమాని ఇదే కోరుకుంటున్నాడు. నేనైతే ముంబై ప్లే ఆఫ్స్ చేరాలనుకుంటున్నా'అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

తొందరలేదు..

తొందరలేదు..

హార్దిక్ బౌలింగ్ చేయకపోవడంపై అనేక అనుమానాలు రేకెత్తుతుండగా.. ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో హార్దిక్‌తో బౌలింగ్‌ చేయించేందుకు తమకు ఏం తొందరలేదని, ఒకవేళ అతణ్ని బలవంతపెడితే అది ఇబ్బందులకు దారి తీసే ప్రమాదముందన్నాడు.'హార్దిక్‌ పాండ్యా సుదీర్ఘ కాలంగా బౌలింగ్‌ చేయలేదు. అతనికి ఏది మంచో అదే చేసేందుకు ముంబై మేనేజ్మెంట్ ప్రయత్నిస్తోంది. టీ20 ప్రపంచకప్‌ 2021లో అతడు భారత జట్టుకు చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. హార్దిక్ విషయంలో భారత జట్టు యాజమాన్యంతో మాట్లాడుతూనే ఉన్నాం. అతను ఐపీఎల్‌లో బౌలింగ్‌ చేస్తాడా లేదా అన్నది రోజూవారీ పరిణామాల్ని బట్టి నిర్ణయిస్తాం. ప్రస్తుతం అతణ్ని బలవంతపెడితే అది తనకు ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉంది. బ్యాటింగ్‌పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుంది' అని అన్నాడు.

Story first published: Saturday, October 2, 2021, 16:52 [IST]
Other articles published on Oct 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+