
కోచ్ తిడితే ఏడుస్తారా?
ఇక అశ్విన్ కామెంట్స్‌పై రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. 'ఆ మ్యాచ్‌లో అశ్విన్ ఆడలేదు. కానీ, కుల్దీప్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కాబట్టి నేను అతన్ని ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. నేను అలా చేయడం వల్లే అశ్విన్ మళ్లీ తన ఆటపై దృష్టిసారించి.. కొత్తగా ప్రయత్నించి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఎలాంటి భేషజాలు లేకుండా నిజాలు చెప్పడమే నా పని. అంతేకాని, ప్రతి ఒక్కరికీ వెన్న పూయడం కాదు. ఒక కోచ్ మిమల్ని పరీక్షిస్తే ఏం చేస్తారు? ఇంటికెళ్లి ఏడ్చుకుంటూ కూర్చొని నేను మళ్లీ ఆడను అంటారా? ఒక ఆటగాడిగా నేనైతే సవాళ్లను స్వీకరించి మెరుగవుతా. అలా నా కోచ్ చెప్పిన మాటలు తప్పని నిరూపించుకుంటా. కుల్‌దీప్ పట్ల నేను చేసిన వ్యాఖ్యలకు అశ్విన్ బాధపడి ఉంటే.. అందుకు నేను సంతోషిస్తున్నా. అందువల్లే అతను సాధన చేసి తిరిగి జట్టులోకి వచ్చాడు' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

బస్సు కింద తోసేసినట్లు...
ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ..'ఆస్ట్రేలియాలో నేను ఐదు వికెట్ల ఘనత సాధించలేకపోయా. నిజమే.. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీశాడు.. భారత్ జట్టు కూడా అక్కడ గెలిచింది. కానీ.. జట్టు సంబరాల్లో మాత్రం నేను మనస్ఫూర్తిగా పాలు పంచుకోలేకపోయా. దానికి కారణం.. రవిశాస్త్రి చెప్పిన ఆ నెం.1 స్పిన్నర్ మాటలు. రవి భాయ్ అంటే నాకెంతో గౌరవం ఉంది. మనం కొన్నిసార్లు తోచినట్లు మాట్లాడేస్తుంటాం.. ఆ తర్వాత మళ్లీ ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటూ ఉంటాం. కానీ.. రవిశాస్త్రి ఆ రోజు మాట్లాడిన మాటలు ఒక్కసారిగా నన్ను బస్సు కింద తోసేసినట్లు అనిపించింది'' అని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

జట్టులో చోటే కోల్పోయిన కుల్దీప్..
ఇదిలా ఉండగా, ఆ సిడ్నీ టెస్టు తర్వాత కుల్‌దీప్ సరైన ప్రదర్శన చేయలేక జట్టులో చోటు కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాడు. మరోవైపు అశ్విన్ తన ఆటను మెరుగుపర్చుకొని బాగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఉన్న హర్భజన్ సింగ్ (417 వికెట్లు) రికార్డును కూడా అశ్విన్ అధిగమించాడు. ప్రస్తుతం 427 వికెట్లతో కొనసాగుతున్న అశ్విన్ అప్‌కమింగ్ సౌతాఫ్రికా సిరీస్‌లో మరో 8 వికెట్లు పడగొడితే కపిల్ దేవ్ (434)ను కూడా ధాటిపోతాడు. దీంతో 619 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న అనిల్‌కుంబ్లే తర్వాత రెండో స్థానాన్ని కైవసం చేసుకునే అరుదైన అవకాశం అశ్విన్ ముందుంది.


Click it and Unblock the Notifications
