For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పనికిరాని మాటలతో కోహ్లీపై ఒత్తిడి పెంచారు.. అందరి నోళ్లు మూయించాడు: రవి శాస్త్రి

Ravi Shastri says Media and critics have put enough pressure on Virat Kohli, He has silenced everyone

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ ఓ స్వచ్చమైన డైమండని, పాకిస్థాన్‌పై అసాధారణ ఇన్నింగ్స్‌తో తాను ఎంతటి విలువైన ఆటగాడిననే విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడని తెలిపాడు. ఆదివారం జరిగిన ఈ ఉత్కంఠకర మ్యాచ్‌లో విరాట్ విరోచిత పోరాటంతో భారత్‌ను ఓటమి నుంచి గట్టెక్కించడమే కాకుండా.. చరిత్రలో నిలిచిపోయే విజయాన్నందించిన విషయం తెలిసిందే.

31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును హార్దిక్ పాండ్యా సహకారంతో ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యంతో గట్టెక్కించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో విరాట్ మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

అందరి నోళ్లు మూయించాడు..

అందరి నోళ్లు మూయించాడు..

ఈ క్రమంలోనే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీడియా, విమర్శకులు పనికిరాని మాటలతో విరాట్‌పై అనవసర ఒత్తిడి తెచ్చారని, ఇప్పుడు అతను అసాధారణ ఇన్నింగ్స్‌తో అందరి నోళ్లు మూంచాడని చెప్పాడు. హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు ఇన్నింగ్స్‌లు తన జీవితాంతం గుర్తుండిపోతయాన్నాడు. 'విరాట్ ఆడిన ఈ అసాధారణమైన ఇన్నింగ్స్‌కు నేనేం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఇలాంటి ఇన్నింగ్స్ అతను ఆడుతాడని కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఆస్ట్రేలియాలో ఇది జరుగుతుందని నాకు ముందే తెలుసు.

పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు..

పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు..

ఎందుకంటే ఇక్కడి పిచ్‌లు అతనికి సరిగ్గా సరిపోతాయి. అంతేకాకుండా అభిమానులు ముందు ఆడటం అతనికి చాలా ఇష్టం. పాకిస్థాన్‌పై అతనికి ఘనమైన రికార్డు ఉంది. cometh the hour, cometh the stage, cometh the man (పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, సమయం వీలుగా లేనప్పుడు.. ఓ వ్యక్తి వచ్చి మొత్తం పరిస్థితులు తనవైపు మరలేలా చేసి విజయం సాధించేవాడు.)అనే వ్యాఖ్యలు విరాట్‌కు సరిగ్గా సరిపోతాయి.

అతని ఇన్నింగ్స్ చూసి నేను భావోద్వేగానికి గురయ్యాను. గత రెండేళ్లుగా అతను అనుభవించిన మానసిక క్షోభ దగ్గర నుంచి చూశాను. అతను కూడా ఇటీవలే ఆ విషయాలను వెల్లడించాడు. ఈ దేశంలో అందరూ షార్ట్ మెమోరీస్ కలిగి ఉన్నారు. ఏదైనా త్వరగా మరిచిపోతారు. వెంటనే అభిప్రాయాలు మార్చుకుంటారు. ఈ టోర్నీలో మళ్లీ భారత్-పాక్‌లు ఫైనల్లో తలపడవచ్చు. ఆ మ్యాచ్ కూడా గొప్పగానే ఉంటుంది.

ఆ రెండు సిక్స్‌లు సూపరో సూపర్..

ఆ రెండు సిక్స్‌లు సూపరో సూపర్..

నా క్రికెట్ జీవితంలోనే నేను చూసిన అతి గొప్ప సిక్స్‌ల్లో హారిస్ రౌఫ్ బౌలింగ్‌లో విరాట్ కొట్టిన సిక్స్‌లు ఉంటాయి. సెంచూరియన్ వేదికగా వరల్డ్ కప్‌ 2003లో షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో సచిన్ టెండూల్కర్ కొట్టిన సిక్స్‌ తర్వాత మళ్లీ అలాంటి సిక్స్‌లు కోహ్లీ కొట్టడమే చూశాను. క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన ఈ సిక్స్‌లు జీవితాంతం గుర్తుంటాయి. వాస్తవానికి విరాట్ ఫామ్ కోల్పోలేదు. కానీ బయో బబుల్, ఐసీసీ టైటిల్ గెలవలేదనే అనవసర మాటల కారణంగా మానసిక ఒత్తిడికి గురయ్యాడు. కరోనా సమయంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు జరగడం, కఠిన బయో బబుల్ కారణంగా ఆటగాళ్లు కూడా ఒకరికొకరు దూరం పాటించడం మానసికంగా ప్రభావం చూపింది.

అందుకే రెస్ట్ తీసుకోమన్నా..

అందుకే రెస్ట్ తీసుకోమన్నా..

బయోబబుల్స్ కారణంగా గంటలకొద్దీ రూమ్‌ల్లో ఒంటరిగా గడపాల్సి వచ్చింది. బెన్ స్టోక్స్ వంటి ఆటగాళ్లు మానసిక సమస్య గురించి బహిరంగంగా కూడా మాట్లాడారు. విరాట్ కూడా ఆ మానసిక క్షోభకు గురయ్యాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లోనే అతని తడబాటు నేను గమనించా. అందుకే విశ్రాంతి తీసుకోవాలని సూచించా. ఇక ఆసియాకప్ ముందు నెలరోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న విరాట్.. రీఎంట్రీలో దుమ్మురేపాడు. అతని మానసికంగా చాలా బలంగా కనిపించాడు. చాలా ప్రశాంతంగా ఆడాడు. ఆ క్షణమే అతను ట్రాక్‌లోకి వచ్చాడని భావించా. పాక్‌తో ఇన్నింగ్స్‌లో విరాట్‌కు హార్దిక్ పాండ్యా కూడా సహకారం అందించాడు. క్రీజులోకి వచ్చి తడబడుతున్న కోహ్లీకి ధైర్యం చెప్పాడు. మ్యాచ్ గెలిచేద్దామనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు. మ్యాచ్ అనంతరం విరాటే ఈ విషయాన్ని వెల్లడించాడు కూడా. మొత్తానికి ఒక్క ఇన్నింగ్స్‌తో విరాట్ అందరి నోళ్లు మూయించాడు'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, October 25, 2022, 13:59 [IST]
Other articles published on Oct 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+