Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravi Shastri: భారత్ తుది జట్టులో అతనికి చోటు కష్టమే!

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) అభిప్రాయపడ్డాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేరికతో కుల్దీప్ యాదవ్‌కు అవకాశాలు మూసుకుపోయే ప్రమాదం ఉందన్నాడు. భారత్‌తో పాటు ఇతర జట్లకు మెగా టోర్నీలో ఫైనల్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం పెద్ద సవాల్ అని చెప్పాడు.

గురువారం నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో రవి శాస్త్రి పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ప్రపంచకప్‌లో జట్టు కోసం ప్రతీ ఆటగాడు సిద్దంగా ఉండాలి. ఎప్పుడు అవకాశం ఇచ్చినా సత్తా చాటాలి. భారత జట్టులో అశ్విన్ చేరడంతో తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది.

 Ravi Shastri says Kuldeep Yadavs place in the playing XI of India is not confirmed

కుల్దీప్ యాదవ్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాణించిన మాత్రానా అతని స్థానం సుస్థిరం కాదు. ఇతర బౌలర్ల ప్రదర్శనపై అతను ఆధారపడాల్సి ఉంటుంది. అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌పై ఎలాంటి సందేహాలు లేవు. అతనో అద్భుతమైన బౌలర్. సుదీర్ఘ కాలం తర్వాత జట్టులోకి వచ్చి సత్తా చాటాడు.

ఇటీవల జరిగిన అన్నీ సిరీస్‌ల్లోనూ నిలకడైన ప్రదర్శన చేశాడు. పిచ్ పొడిగా ఉంటే మాత్రం కేవలం ఇద్దరు ప్రధాన పేసర్లతోనే ఆడాలి. అప్పుడు ముగ్గురు స్పిన్నర్లను ఆడించే అవకాశం లభిస్తోంది. హార్దిక్ పాండ్యా రూపంలో ఓ పేస్ ఆల్‌రౌండర్ జట్టులో ఉన్నాడు.'అని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో అశ్విన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

Kuldeep Yadav

ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ కంటే అశ్విన్‌కే ప్రథమ ప్రాధాన్యత లభిస్తోందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే ఈ వ్యాఖ్యలకు భిన్నంగా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. భారత్ తరఫున కుల్దీప్ యాదవే అత్యధిక వికెట్లు తీస్తాడని జోస్యం చెప్పాడు. ఇర్ఫాన్ పఠాన్ మాత్రమే కాకుండా సంజయ్ మంజ్రేకర్, వినయ్ కుమార్, మిథాలీ రాజ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Story first published: Wednesday, October 4, 2023, 20:15 [IST]
Other articles published on Oct 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+